ప్రతీ గడపకు గ్యారెంటీ
- ఇందిరమ్మ రాజ్యంతోనే అభివృద్ధి సాధ్యం
- బీజేపీ, బీ ఆర్ ఎస్ రెండూ ఒక్కటే
- పార్లమెంట్ ఎన్నికల్లో వాటికి ప్రజలే సరైన బుద్ధి చెప్పాలి
- మీ ఆశీస్సులతోనే గెలిచి గృహ నిర్మాణ మంత్రిని అయ్యాను
- మొన్ననే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించుకున్నాం
- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
- కూసుమంచి, జీళ్ళ చెర్వు లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం
కూసుమంచి : ప్రతీ గడపకు ఆరు గ్యారెంటీ పథకాలు చేరుతాయని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. పాలేరు నియోజక వర్గంలోని కూసుమంచి, జీళ్లచెర్వు గ్రామాల్లో జరిగిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి మాట్లాడుతూ…. వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. మరి కొద్ది గంటల్లో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్నారు. వేసవికాలంలో నే శంకుస్థాపన చేసిన అన్ని రోడ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, తాను కూడా గెలిచి పాలేరు నియోజకవర్గ ప్రజలు కోరుకున్న విధంగా గృహ నిర్మాణ శాఖ మంత్రిని అయ్యానని పేర్కొన్నారు. మొన్ననే భద్రాచలం వేదికగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సీఏం చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు కట్టిచ్చారని గుర్తు చేశారు. గడిచిన ప్రభుత్వం మాటలతో కాలయాపన చేసిందని తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అవుతుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించారు. ఎన్నికల్లో లాభం పొందాలని కేంద్రంలో అధికారం లో ఉన్న ప్రభుత్వం,మొన్నటి వరకు అధికారం లో ఉన్న ప్రభుత్వం డ్రామాలడుతున్నాయని ఆరోపించారు. ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజల కోరికలు నెరవేర్చాడానికి ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో రాయల నాగేశ్వరరావు, మద్దినేని బేబీ స్వర్ణ కుమారి, మద్ది శ్రీనివాస రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మట్టే గురవయ్య, హఫీజుద్దీన్, మదాసు ఉపేందర్, బారి వీరభద్రమ్, చెన్నా మోహన్, జూకురి గోపాల్ రావు , బజ్జూరి వెంకట్ రెడ్డి , పెండ్ర అంజయ్య, మంకెన వాసు, సూర్య నారాయణ రెడ్డి, జొన్నలగడ్డ రవి, యడవల్లి రామి రెడ్డి, అంజి రెడ్డి, వెంకట రత్నం, సెట్రం, పోటు లెనిన్, జిల్లా , నియోజక వర్గ, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.