ఎమ్మెల్సీ కవితకు రిమాండ్
ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల రిమాండ్ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 23 వరకు కస్టడీకి ఇస్తూ తీర్పు ఇచ్చింది.
శుక్రవారం రాత్రి ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారులను ఆమెను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. రాత్రి ఢిల్లీ తరలించి శనివారం ఉదయం కోర్టులో హాజరుపర్చారు.
కవితను 10 రోజుల కస్టడీ కావాలని ఈడీ అధికారులు కోరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.
ఈడీ అధికారుల వాదనలు ఏకీభవించింది. కవితను 7 రోజులకు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కవిత భర్తకు ఈడీ నోటీసులు
ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. కవిత భర్తతో పాటు ముగ్గురు కవిత వ్యక్తిగత సిబ్బందికి కూడా ఈడీ అధికారులు నోటీసులు అందించారు.
ఇప్పటికే నలుగురి ఫోన్లను సీజ్ చేశారు. నిన్న కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ.. ఆయన వ్యాపార లావాదేవీలపై ఆరా తీసింది. ఈ నేపథ్యంలో తాజా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.