అక్రమంగా మట్టి రవాణా వ్యాపారం చేస్తే కఠిన చర్యలు
ఎస్సై రామాంజనేయులు
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 18
అక్రమంగా మట్టి రవాణా వ్యాపారం చేస్తే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఆంజనేయులు అన్నారు. గుండ్లపల్లి గ్రామ శివారులోని కృష్ణా నది ఒడ్డున చైన్ మెషిన్ తో మట్టిని త్రవ్వి మూడు టిప్పర్ లతో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని అక్రమంగా తరలించుచున్నారు అనే సమాచారం మేరకు మట్టంపల్లి ఎస్సై రామాంజనేయులు పోలీస్ సిబ్బంది సోమవారం సాయంత్రం అట్టి ప్రదేశాన్ని చేరుకొని ఒక చైన్ మెషిన్ మరియు మూడు టిప్పర్ లను స్వాదీనం చేసుకొని, దీనికి కారణం అయిన దేవపంగు రవి తండ్రి సాలయ్య, రఘునాదపాలెం గ్రామం అనునతనిపై మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు, ఎస్సై మాట్లాడుతూ మండలంలో ఎవరైనా అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి రవాణా వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకొనబడుననీ తెలిపారు.