అంగన్వాడీ సెంటర్ కు కుర్చీలను బహుకరించిన పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్,
ఘనంగా సన్మానించిన అంగన్వాడీ సూపర్ వైజర్ శ్రీమతి ఉమా మరియు స్టాఫ్
పోషణ పక్షం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన స్థానిక ప్రజలు…
వివరాల్లోకి వెళ్ళితే, ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం, గొర్రెల పాడు తండా పరిధిలో చాంప్లా తండాలోని అంగన్వాడీ సెంటర్లో పోషణ పక్షం కార్యక్రమములో గత వారంలో సందర్శించి పోస్టిక ఆహారంపై అవగాహన కలిపించడానికి హాజరైన పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ స్థానిక అంగన్వాడీ సెంటర్లో గర్భిణీ స్త్రీలు క్రింద కూర్చోని ఉండగా గమనించి, అక్కడి అవసరతను గురించి స్థానిక అంగన్వాడీ టీచర్ తో మాట్లాడి చైర్స్ కు విరాళం అందించారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న అంగన్వాడీ సూపర్ వైజర్ శ్రీమతి ఉమా ఈ రోజు చాంప్లా తండాలోని అంగన్వాడీ సెంటర్ ను దర్శించి స్థానిక అంగన్వాడీ సెంటర్ కు చైర్స్ అందించినందుకు ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ సమితి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ గారిని అభినందిస్తూ, శాలువతో ఘనంగా సన్మానించారు.
డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ చేస్తున్న సామాజిక సేవల్ని గుర్తు చేస్తూ వారు కలిగి ఉన్నా సామాజిక స్పృహను బట్టి ఉమా గారు ప్రశంసించారు. ఇదే క్రమంలో అక్కడికి విచ్చేసిన గొర్రెలపాడు తండా మరియు చాంప్లా తండా నాయకులు సామాన్యులు పలువురు డాక్టర్ పీటర్ నాయక్ ని ప్రశంసలతో ముంచేత్తారు..
ఈ నేపథ్యంలో అంగన్వాడీ సూపర్ వైజర్ శ్రీమతి ఉమా గారు మాట్లాడుతూ పోషణ పక్షం కార్యక్రమాన్ని గురించి ప్రజలకు అర్థమైయేల వివరించారు. మరియు చాంప్లా తండాలోని అంగన్వాడీ సెంటర్లో తలపెట్టిన కార్యక్రమానికి విచ్చేసిన పలువురుని బట్టి అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.
పోస్టికాహారం గురించి స్థానిక ప్రజల్లో చైతన్యం రావాలంటే ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ప్రభుత్వం ద్వారా అందిస్తున్న పోస్టికాహారం గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించి ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలని ఉమా గారు తన ప్రసంగంలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ సమితి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ గారు, అంగన్వాడీ సూపర్ వైజర్ శ్రీమతి ఉమా గారు, స్థానిక అంగన్వాడీ టీచర్ బానోతు కవిత, అంగన్వాడీ టీచర్ శామాల, బానోతు శ్రీనివాస్ రావు, లకావత్ నాగేశ్వర్రావు, లకావత్ జాన్, తేజావత్ కిషన్ నాయక్, తేజావత్ వెంకటేష్ నాయక్, తేజావత్ మంజ్యా నాయక్, లకావత్ మట్యా నాయక్, తేజావత్ పాప నాయక్, భూక్యా ఫకీరా నాయక్, భూక్యా బిక్ష్యం నాయక్,
మాజీ సర్పంచ్ గుగులోతు బాబు నాయక్, బానోతు నాగులు నాయక్, బానోతు రాగు నాయక్, తేజవత్ పోస్టు శ్రీను నాయక్, బానోతు రవి నాయక్, బానోతు శంకర్ నాయక్, మరియు దారావత్ లింగా నాయక్ తదితరులు పాల్గొన్నారు..