పది కిలోల గంజాయి సీజ్…
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
మార్చ్ 23,
ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం ఆధ్వర్యంలో భద్రాచలం కూనవరం రోడ్డులో కారులో అక్రమంగా తరలిస్తున్న 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా వల్లెం కుంట గ్రామానికి చెందిన బొమ్మ నితిన్ హైదరాబాదులో ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తూ గంజాయి కి బానిస అయ్యాడు.
డెలివరీ బాయ్ గా తనకు వస్తున్న ఆదాయం తన జల్సాలకు సరిపోకపోవడం తో గంజాయి అక్రమ రవాణా చేసి అధిక డబ్బులు సంపాదించాలి అనుకున్నాడు.
ఇందుకు తనలాగే గంజాయి కి బానిస అయినా తన మిత్రులు జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఎనగందుల శశాంక్, వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం చంటయ్యపల్లి గ్రామానికి చెందిన భూక్య సంపత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుండాయిగూడెం మండలం రామానుజవరం గ్రామానికి చెందిన శ్రీ రామ్ షణ్ముఖ శ్రీ మరియు మరొక మైనర్ మిత్రులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు.
అద్దె కారు ఖమ్మం జిల్లాలో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు ఎక్కువ అయ్యాయి. కనుక తమ సొంత వాహనంలో వెళ్లి పట్టుబడితే ఆర్థికంగా పెద్ద మొత్తంలో నష్టం.
కనుక అద్దె కారు అయితే తమకేమీ నష్టం లేదు అని నిర్ణయించుకొని హైదరాబాదులోని చైతన్య పురిలో లాంగ్ డ్రైవ్ అనే సంస్థ కు మూడు వేల రూపాయలు చెల్లించి కారును అద్దెకు తీసుకున్నారు.
సుదీర్ఘ ప్రయాణం – జల్సాలు ఈ ఐదుగురు కలిసి శుక్రవారం హైదరాబాద్ నుండి బయలుదేరి మధ్యలో గంజాయి మరియు మద్యం తాగుతూ సాయంత్రానికి భద్రాచలం మీదుగా సీలేరు చేరుకున్నారు.
అర్ధరాత్రి ప్రయాణం రాత్రిపూట సీలేరు లోని గుర్తు తెలియని వ్యక్తులు వద్ద సుమారు 10 కిలోల గంజాయి ని కిలో 300/- రూపాయల చొప్పున కొని అర్థరాత్రి సమయంలో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు.
శనివారం తెల్లవారుజామున ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుబడ్డారు. అధికారులు వారి వద్ద నుండి ఒక కారు, ఐదు సెల్ ఫోన్లు, 9.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
ఐదుగురు నిందితులను అరెస్టు చేసి భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. పట్టుబడిన గంజాయి, మొబైల్ ఫోన్లు, కారు విలువ సుమారు ఆరు లక్షలు ఉంటుంది. తనిఖీల్లో ఎక్సైజ్ సీఐ రమేష్ మరియు సిబ్బంది బాలు, హరీష్, వెంకట్, సుధీర్, విజయ్ పాల్గొన్నారు.