శుభోదయ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉచిత హెల్త్ క్యాంప్
తండ్రికి తగ్గ కూతురు డాక్టర్ సంయుక్త
హైదరాబాద్ టాప్ టెన్ డాక్టర్లలో సంయుక్త ఒక్కరు
విచారణ గురువులు ఫాదర్ మార్టిన్ పసల
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 24
మఠంపల్లి మండల కేంద్రంలో సుభవార్త దేవాలయ ప్రాంగణంలో శుభోదయ యూత్,ఫాథర్ మార్టిన్ పసల మరియు చర్చి పెద్దల ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ ఆదివారం డాక్టర్ సంయుక్త హైదరాబాద్ వారిచే నిర్వహించబడింది.
ఇట్టి కార్యక్రమాన్ని విచారణ గురువులు ఫాదర్ మార్టిన్ పసల శుభోదయ యూత్ అధ్యక్షులు గాదె జయ భరత్ రెడ్డి, అల్లం ఇన్నారెడ్డి ఆదూరి కిషోర్ రెడ్డి, గాలి చిన్నపురెడ్డి సెంటాన్స్ సుపీరియర్ సిస్టర్ రూబీ గా సుజాత లు ప్రారంభించారు.
ఈ యొక్క క్యాంప్ లో.ఫాథర్ మార్టిన్ పసల మాట్లాడుతూ తండ్రికి తగ్గ కూతురు డాక్టర్ సంయుక్త అని క్రీస్తు శేషులు డాక్టర్ టీఎస్ రెడ్డి మఠంపల్లి లో చదువుకొని ఉన్నత చదువులు చదివి డాక్టర్ గా పట్టా పొంది హుజుర్ నగర్ లో హాస్పటల్ నెలకొల్పి ఈ నియోజకవర్గ ప్రాంత ప్రజలకు సుదీర్ఘంగా సుమారుగా 40 సంవత్సరాలు వారి వృత్తిలో డాక్టర్ రాణించి హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రాంత ప్రజల మన్నలను పొందారని సమాచారం
వారి బాటలోనే వారి కూతురు ఉన్నత చదువులు చదివి హైదరాబాద్ నగరంలో టాప్ టెన్ డాక్టర్లలో ఒక్కరిగా పేరుగాంచిన డాక్టర్ సంయుక్త అదే దృక్పథంతో ఏ ప్రాంతంలో నైతే వారి తండ్రి ఈ యొక్క వృత్తిలో సేవలు అందించారో అదే సంకల్పంతో మఠంపల్లిలో ఈ యొక్క క్యాంపును నిర్వహించటం చాలా సంతోషంగా ఉందని ఇంకా వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగాలని ఆ మరియా తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ వారి కుటుంబం పై ఆమెపై ఉండాలని ఆకాంక్షించారు
ఇట్టి కార్యక్రమంలో డాక్టర్ సంయుక్త మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఇట్టి కార్యక్రమం ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ అమ్మ అవడం దేవుడిచ్చిన గొప్ప వరం అని నలుసుగా కడుపులో పడినప్పటి నుండి 9 నెలలు నిండి తన బిడ్డ భూలోకంలోకి వచ్చేవరకు ఆ తల్లి పొందే అనుభూతి మాటల్లో చెప్పలేనిదని ఒక స్త్రీ గా అమ్మగా ఆ తపన నాకు తెలుసని తెలియకుండానే తల్లి, బిడ్డకు మధ్య అనురాగాలు పెరుగుతాయి తన తల్లి ప్రతి కష్టాన్ని ఇష్టాన్ని ఆ బిడ్డకు కడుపులో ఉండే తెలుసుకుంటుంది.
అయితే ఆ అదృష్టం ఎంతమందికి ఉంటుంది ఎంతోమంది పెళ్లి అయిన మొదటి రోజు నుండి తల్లి కావాలనే తపన ఎంతో ఉంటుంది కానీ అది ఇప్పుడు ఈ రోజుల్లో కొందరికె ఆ అదృష్టం అందుతుంది.కావున చాలామంది మహిళలు ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ లక్షలాది రూపాయలు వెచ్చించిన కొందరికి ఆ అదృష్టం అందడం లేదు పల్లెల నుండి పట్టణాల వరకు రావాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం
కాబట్టి గ్రామీణ ప్రాంతంలో అటువంటి వైద్య పరీక్షలు మరియు సలహాలు ఇచ్చేవారు చాలా అరుదుగా ఉంటారు కాబట్టి కొంతైనా మా నుండి గ్రామీణ ప్రాంత ప్రజలకు మరియు మా తండ్రి ఇదే ప్రాంత ప్రజలకు ఎన్నో సేవలు చేశారు కాబట్టి వారి జ్ఞాపకార్ధంగా వారి తలంపుతో ఈ యొక్క క్యాంపుకు రావటం జరిగిందని అన్నారు .
ఈ యొక్క క్యాంపులో అల్ట్రా సౌండ్ స్కాన్ సంతానం లేని వారి వారికి ఎలాంటి ట్రీట్మెంట్లు చేసుకుంటే అవకాశాలు పెరుగుతాయి ఏ విధమైన రక్త పరీక్షలు చేసుకోవాలి ఆపరేషన్ లేకుండా ఎలా ప్రెగ్నెన్సీ అవకాశాలు పెంచుకోవాలి అని మొదలైన వాటిపై ఆమె వివరించారు.
ఇట్టి కార్యక్రమంలో అల్లం ఇన్నారెడ్డి మాట్లాడుతూ శుభోదయ యువజన సంఘం సభ్యులు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయమని రానున్న రోజుల్లో ఇంకా ఈ గ్రామానికి ఈ యొక్క సంఘం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ యొక్క క్యాంప్ లో సుమారుగా 48 మంది గర్భిణీ స్త్రీలు, మహిళలు పాల్గొన్నారు.