తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును
యేసు శిష్యుల పాదాలు కడగడం అనేది సేవా భావానికి గుర్తు
అహంకారాన్ని వదిలి సోదర భావంతో జీవించాలి
ఫాథర్ మార్టిన్ పసల,ఫాథర్ కాసు సాగర్ రెడ్డి
మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త దేవాలయంలో గురువారం గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకుని 40 రోజుల ఉపవాస దీక్షలో భాగంగా చివరి రోజున ఏసుక్రీస్తు శిష్యుల పాదాలు కడుగు ఘట్టాన్ని సువార్త దేవాలయ విచారణలో ఫాదర్ మార్టిన్ పసల ఆధ్వర్యంలో క్రైస్తవ విశ్వాసుల నడుమ దైవ సన్నిధిలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫాథర్ కాసు సాగర్ రెడ్డి దివ్యబలి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఫాదర్స్గురుత్వం యొక్క గొప్ప విశిష్టతను తెలియజేస్తూ గురుత్వం అనేది దేవుడే స్వయంగా ఏర్పాటు చేసి తన బిడ్డలైన క్రైస్తవులకు ఇచ్చిన అత్యంత పవిత్రమైన పరిశుద్ధమైన దివ్య అంతస్తు అని గురువు అంటే ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సేవ చేసే సేవకుడని క్రైస్తవులుగా ఉన్న మనలను వారి యొక్క బోధన ద్వారా సన్మార్గంలో నడిపించి పరలోకానికి దారి చూపే మహాత్ముడు దివ్య బలి పూజలు క్రీస్తును మన మధ్యలోనికి తీసుకుని వచ్చే అపర క్రీస్తు గురువు దైవ ప్రజలను దేవుని మార్గంలో దేవుని చెంతకు నడిపించే గొప్ప నాయకుడు తన కుటుంబ సంబంధాలు అన్ని వదిలి దైవ సేవకు అంకితమై క్రైస్తవ సంఘ ప్రజలకు ఒక మంచి కాపరి గురువు మనందరము పుట్టినప్పుడు మొదలు జ్ఞాన స్థానం దివ్య సప్రసాదం భద్రమైన అభ్యంగనం మన చివరి రోజుల్లో అవస్థ అభ్యందనం భూస్థాపిత పూజ వరకు ఇలా దైవ సంస్కారాలతో పరలోకమునకు మన ఆత్మలు చేరుటకు ముఖ్యమైన వారధి గురువు వారి నిజజీవితంలో ఉన్నటువంటి సాధక బాధలు భరిస్తూ బయటకు నవ్వుతూ నిత్యం మనకోసం ప్రార్ధించే మహా వ్యక్తి గురువు మనం వ్యాధి బాధలతో ఉంటే మా కోసం ప్రార్థించండి అని చెప్పుకోవడానికి గురువు కావాలి మన గృహ నిర్మాణంలో పునాది నుండి గృహప్రవేశం వరకు మనకు గురువు దీవెనలు కావాలి. కొత్త వాహనం ఆశీర్వదించాలి అంటే గురువు కావాలి కొత్త వ్యాపారం ప్రారంభించాలంటే గురువు దీవెన కావాలి ఇలా చెప్పుకుంటూ పోతే మన జీవితంలో గురువు అవసరం ఎంతగానో ఉందని చెప్పడంలో సందేహం లేదు అందుకే దైవ ప్రజలమైన మనం వారికోసం నిత్యం ప్రార్థించి క్రీస్తుకి మనకు మధ్య స్థానంలో ఉన్న ఆ అపర క్రీస్తుని గౌరవించుదాం తెలిపారు.
అనంతరం ఏసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యుల పాదాలను కడిగి వారికి బ్లడ్ రొట్టెలను అందించి వస్త్రాలను వారికి అందజేశారు. అటు పిమ్మట ఫాథర్ మాట్లాడుతూ శుక్రవారం ఏసుక్రీస్తుని సిలువ వేసిన రోజు కాబట్టి ఉదయం 7.30 గం లకు యేసు క్రీస్తు సిలువ మార్గం అంబేద్కర్ ప్రధాన కోడలి నుండి చర్చి వద్దకు 14 స్థలాలలో సన్నివేశ ఘట్టాలలో భక్తులందరూ పాల్గొని దేవుని దీవెనలు పొందాలని అన్నారు . ఇట్టి కార్యక్రమంలో చర్చి పెద్దలు శుభోదయ యువజన సంఘం సభ్యులు భక్తులు పాల్గొన్నారు.