నేడే గుడ్ ఫ్రైడే
మానవాళి పాపాలకు జీసస్ శిలువపై ప్రాణాలను వదిలాడు
ఫాదర్ మార్టిన్ పసల
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 29
మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త దేవాలయంలో నేడు గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ యొక్క గుడ్ ఫ్రైడే ను ఉద్దేశించి ఫాదర్ మార్టిన్ పసల మాట్లాడుతూ క్రైస్తవులందరూ గుడ్ ఫ్రైడే ను ఎంతో పవిత్రమైన రోజుగా పరిగనిస్తారని ఏసుక్రీస్తును సిలువ వేసిన ఈ రోజున గుర్తు చేసుకుంటూ మానవాళి పాపాలకు జీసస్ శిలువపై ప్రాణాలను వదిలారని అందుకు ఏసుక్రీస్తు జ్ఞాపకార్థం ఈరోజును పవిత్ర శుక్రవారం లేదా బ్లాక్ ఫ్రైడే అని పిలుస్తారని సిలువ వేయబడిన మూడు రోజుల
తర్వాత యేసు పునరుద్ధానాన్ని ఆదివారం రోజు ఈస్టర్ గా పరిగణిస్తారని ఈ రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి దేవుని తలచుకుంటూ జీసస్ ప్రార్ధనలో గడుపుతారని ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేస్తూనే ఉంటారని ప్రవచనాలు ప్రార్థనలు ధ్యానం వంటివి జరుగుతూనే ఉంటాయని యేసు మరణానికి త్యాగానికి గుర్తుగా సంతాపాన్ని తెలియజేయడానికి దీన్ని నిర్వహించుకుంటారని అన్నారు.