ఆ జిల్లాలో మావోయిస్టు పార్టీ పేరిట కరపత్రాలు
కొత్తగూడెం జిల్లా : మావోయిస్టు పార్టీ పేరిట కరపత్రాలు కలకలం రేపా యి. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు కన్నాయుగూడెం వద్ద శనివారం నడిరోడ్డుపై మావోయిస్టులు కరపత్రాలు లభ్యమయ్యాయి.
కరపత్రాల్లో ఆదివాసీలను విచ్ఛిన్నం చేసే విధంగా దేశ, విదేశీ బహుళజాతి కార్పొ రేట్,కంపెనీల మైనింగ్స్, ప్లాంట్లు, రోడ్లు, డ్యాంలు, టైగర్ జోన్‌లు, అభయార ణ్యాలు వంటి ప్రాజెక్టులను నిలిపి వేయాలని మావోయి స్టులు హెచ్చరించారు.
భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు డివిజన్ల కమిటీ మావోయిస్టు పార్టీ పేరుతో కరపత్రాల్లో డిమాం డ్ చేశారు.
ఆదివాసీల స్వయం ప్రతిపత్తికి, చట్టా లకు భంగం కలిగించే, ఉద్యమాలను అణచివేసే కార్పెట్ సెక్యూరిటీ పోలీస్ క్యాంపులను, పారామిల టరీ, స్పెషల్ బలగాలను ఎత్తివేయాలని, లేని పక్షంలో ప్రతీకార చర్యలు తప్పవని మావోలు కరపత్రాలలో హెచ్చరించారు.