చెలరేగిపోతున్న బిల్డర్లు…
పర్మిషన్ ఒకటి , నిర్మాణం ఇంకొకటి…
పి ఎన్ ఆర్ లో ఆగని అక్రమ నిర్మాణాలు….
*భవిష్యత్తు అవసరాలకు కోసం పార్కింగ్ స్థలం వదలాలి. *సెట్ బ్యాక్ ఎక్కడ కనపడవు.
*వీటికి తోడు విచ్చలవిడిగా పెంట్ హౌస్ నిర్మాణాలు *పిఎన్ఆర్ టౌన్షిప్ అక్రమ నిర్మాణాలకు అడ్డ
సీకే న్యూస్ ప్రతినిధి /పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామపంచాయతీ పరిధిలో పిఎన్ఆర్ టౌన్షిప్ లో ఆగని అక్రమ నిర్మాణాలు గ్రామపంచాయతీ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్లు గ్రామపంచాయతీ నుండి నోటీసులు జారీ చేసిన పట్టించుకోని యజమానులు జోరుగా నిర్మాణాలు జి ప్లస్ 2 కు అనుమతి తీసుకొని నాలుగో ఐదు అంతస్తులు నిర్మాణం చేపడుతున్నారు
గతంలో స్వయంగా జిల్లా అధికారులు వచ్చి పంచాయతీ అధికారులతో కలిసి అక్రమ నిర్మాణాలను కూల్చివేసి ఇలాగే నిర్మాణాలు చేపడితే యజమానులపై ప్రభుత్వపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆనాడే చెప్పారు అయినా బిల్డర్లు అలాంటి హెచ్చరికలు బేఖాతరు చేసి యదేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు
బిల్డర్లు మాయమాటలు చెప్పి వినియోగదారులకు అపార్ట్మెంట్లు. అమ్మేస్తున్నారు కొనేముందు ఒకసారి ఆలోచించి వీటికి సరైన పత్రాలు ఉన్నాయా పర్మిషన్ ఉందా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని కొనవాల్సిందిగా మనవి ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఆపకుంటే గ్రామ పంచాయితీకి భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని ప్రజలు కోరుతున్నారు