“మహనీయుల జయంతి ఉత్సవాలను జయప్రదం చేద్దాం”
ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా నాయకుల పిలుపు
సి కే న్యూస్ (సంపత్) ఏప్రిల్ 01
మహనీయులు బాబు జగజీవన్ రామ్,మహాత్మ జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ ల జయంతుల సందర్భంగా ఈనెల 5వ తేదీ నుండి 14వ తేది వరకు జరిగే ఉత్సవాలను జయప్రదం చేయాలని ఉత్సవ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు
సోమవారం జిల్లా కేంద్రంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ సంధర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్,బట్టు రామచంద్రయ్య,బుగ్గ మైసయ్య, జనగాం పాండు తదితరులు ప్రసంగిస్తూ కుల,మత,రాజాకీయాలకు అతీతంగా ప్రతీఒక్కరు మహనీయుల జయంతి ఉత్సవాలలో పాల్గొని విజయవంతం చేయాలని,మహనీయుల ఆశయాలను ఈ ఉత్సవాల సందర్భంగా విస్తృత ప్రచారం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఈరపాక నర్సింహ,పడిగల ప్రదీప్,సురుపంగ శివలింగం, కార్తాల శ్రీనివాస్,ఇటుకల దేవేందర్,దొడ్డి యాదగిరి, దుబ్బ రామకృష్ణ,సురుపంగ సుభాష్,ఏశాల అశోక్,దేవరకొండ నర్సింహ చారి,మంగ ప్రవీణ్,క్యాసగళ్ల చందు,అన్నంపట్ల కృష్ణ,కుతాడి సురేష్,బాణోత్ భాస్కర్ నాయక్,దిరావత్ రాజేష్ నాయక్,నాగారం శంకర్,బుగ్గ దేవేందర్,నిలుగొండ శివశంకర్ దర్గాయి జహంగీర్,దర్గాయి దేవేందర్,చిలవేరు రమేష్,కొల్లూరి హరీష్,వద్ధిగల దాస్,బర్రె నరేష్,కర్కాల రమేష్, కోళ్ల భిక్షపతి,పొట్ట కిరణ్,సిర్పంగా చందు,కానుకుంట్ల రమేష్ ,చుక్క స్వామి,పులిగిల్ల బాలయ్య,పల్లెర్ల వెంకటేశం,బొల్లెపల్లి అశోక్, ఎర్ర శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.