హైదరాబాదులో రెండు వేరు వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు
హైదరాబాద్‌లో బుధవారం తెల్లవారుజామున రెండు వేర్వేరు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
ఒకటి ఆయిల్ గోదాంలో కాగా.. మరొకటి ప్లాస్టిక్ పరిశ్రమలో సంబవించింది. మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయిల్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు యత్నిస్తు న్నారు.
మంటలు అంటుకున్న వెంట నే ఆయిల్ గోదాం నుంచి పెద్ద ఎత్తున శబ్దం రావడం తో స్థానిక ప్రజలు భయాం దోళనకు గురయ్యారు. మరోవైపు కాటేదాన్‌లో ఇటీవలి కాలంలో అగ్ని ప్రమాదాలు సర్వసాధా రణమయ్యాయి.
నేటి తెల్లవారుజామున మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సాయిబాబా నగర్‌లోని విమల్ ప్లాస్టిక్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు తోడు నల్లటి పొగ పరిసర ప్రాంతమంతా దట్టంగా వ్యాపించింది.
హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది.. రెండు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేసేం దుకు ప్రయత్నిస్తున్నారు. కాటేదాన్‌లో ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా పుట్టగొడుగుల మాదిరిగా పరిశ్రమలు వెలిశాయి.
ముందస్థు కనీస జాగ్రత్తలు సైతం పట్టించుకునే వారు లేరు. దాని ఫలితమే తరు చు చోటు చేపుకుంటున్న అగ్నిప్రమాదాలు. అయితే ఈ తెల్లవారుజామున చోటు చేసుకున్న అగ్నిప్రమాదాల్లో జరిగిన నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు…