వాటర్ ట్యాంక్ లో కోతుల కళేబరాలు
నల్గొండ జిల్లా:ప్రతినిధి
నల్గొండ జిల్లా:, ఏప్రిల్ 04
నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ లోని ఓ వాటర్ ట్యాంకర్ లో బుధవారం వానర కళేబరాలు ఉండడంతో స్థానికులను భయాందో ళనకు గురిచేసింది.
ట్యాంకర్ నుంచి 30 నుంచి 40 కోతుల మృతదేహాలను బయటికి తీసారు. మున్సిప ల్ సిబ్బంది నీటిలో తేలియా డుతున్న వానర కళేబరాలు చూసి అంతా షాక్ కు గురయ్యారు.
.కాగా కొద్దిరోజులుగా అవే ట్యాంకర్ నీరు ప్రజలు తాగు తున్నారు నందికొండ మున్సిపాలిటి ప్రజలు. ట్యాంకర్ కు పైకప్పు లేకపోవడం తో కోతులు తాగు నీరు కోసం వెళ్లి ట్యాంకులో పడ్డట్టు అనుమానిస్తున్నారు.