నిషేధిత గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ మహిళ
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) ఏప్రిల్ 05
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ధర్మవరపు పాడు తండాకు చెందిన గుగులోతు విజయ భర్త సైదా వయసు (40) సంవత్సరాలు కూలీ పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ రోజువారిగానే కూలి పని కోసం వెళుతుండగా
అందులో కొంతమంది ఆమె స్నేహితుల ద్వారా గంజాయి తనకు త్రాగుడు అలవాటు అయిందని కూలి పనిలో వచ్చే డబ్బులు సరిపోనందున ఆమె గంజాయి అమ్మి ఎక్కువ డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో కొంతకాలంగా తెలిసిన వ్యక్తి దగ్గరనుండి నిషేధిత గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి దానిని చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారుచేసి
జగ్గయ్యపేట టౌన్ నుండి తీసుకొని ప్యాసింజర్ ఆటోలలో వస్తూ చింతలపాలెం మీదుగా మహిమ సిమెంట్ ఫ్యాక్టరీ లోని కూలీలకు మరియు అవసరమైన వ్యక్తుల వద్దకు వెళ్లి ఎక్కువ రేటుకు అమ్మి డబ్బులు సంపాదిస్తున్నాదని రోజు మాదిరిగానే ఆమె దుర్గా అనే మహిళ దగ్గర నుండి ఈ నిషేదిత గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆ గంజాయిని తీసుకొని జగ్గయ్యపేట మీదుగా చింతలపాలెం గ్రామ బస్టాండ్ సెంటర్ వద్దకు రాగా పోలీస్ వాహన తనిఖీలో భాగంగా ఆమె ఆటోల వద్ద ఉండడంతో వెంటనే తనిఖీ చేయగా ఆమె వద్ద 200 గ్రాముల గంజాయి పట్టుబడి చేయడం జరిగిందని చింతల పాలెం ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.