దౌర్జన్యంగా ఆర్ బి ఓ ప్లాంట్ ప్రహరీ గోడ కూల్చివేత
-అడ్డుకున్న సిబ్బంది పై అనుచరులతో దాడి
సికే న్యూస్ అడ్డగూడూర్ ప్రతినిధి(రాజు):ఏప్రిల్07:
అడ్డగూడూరు మండలం కంచనపల్లి పరిధిలోని ఇమ్మడి ఆర్ బి ప్లాంట్ కు సంబందించిన సర్వే నెంబర్ 195/2 లో గల తనకున్న 1.36గుంటల భూమికి సుమారు ఇరవై లక్షల వ్యయంతో నిర్మించిన ప్రహరీగోడను కంచనపల్లి గ్రామానికి చెందిన చెడె చంద్రయ్య తన అనుచరులతో కలిసి జె సి బి తో అర్ధరాత్రి కూల్చారని ప్రముఖ వ్యాపారవెత్త ఆర్.బి.ఓ ప్లాంట్ యజమాని ఇమ్మడి సోమనర్సయ్య విలేకరుల సమావేశంలో తెలిపారు
ఇటీవలే ఫోన్ చేసి యాభై లక్షలు ఇస్తే ఎం లేదు లేకుంటే ప్లాంట్ ఎలా నడిపిస్తావో చూస్తా అని బెదిరించిన కొన్ని రోజులు గడవకుండానే అర్ధరాత్రి వచ్చి ప్రహరీ గోడను కూల్చాడని అడ్డుకున్న సెక్యూరిటీ గార్డ్ పై దాడి చేసి చేతులు కట్టేసి బీత వాహ వాతావరణం సృష్టించి ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేసాడన్నారు
గతంలో సర్వే నెంబర్ 487లో గల అసైండ్ భూములను తన కుటుంబ సభ్యులపై పట్ట,ప్రభుత్వ భూములను తన బీనామిలకు పట్టా చేసి అసలు రైతులను ఇబ్బందులకు గురించేస్తున్నాడని గతంలో కూడ ఆరోపణలు ఉండడం కొసమేరుపు నూట యాభై కుటుంబాలకు నా కంపెనీ ఉపాధి కల్పిస్తున్నా తన పై ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న చెడె చంద్రయ్య తన అనుచరులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్థానిక అడ్డగూడూర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసానని తెలిపారు
ఈ దాడిలో చిప్పలపల్లి మొగులయ్య బెల్లి వెంకన్న భాషబోయిన లింగయ్య ఎల్లముల వీరమళ్ళు నారబోయిన కిష్టయ్య ఎస్ కె జహంగీర్ పాల్గొన్నారని తెలిపారు