నో..పార్కింగ్…
ఖమ్మం లో కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులకు పార్కింగ్ ఎక్కడ?
ఆసుపత్రి ఒక చోట… ఆసుపత్రికి వచ్చే రోగుల వాహనాలు నిలుపుదల మరోచోట..
వాహనాల అడ్డగోలు నిలుపుదలతో ట్రాఫిక్ కష్టాలు
ఇబ్బందులు పడుతున్న గృహ, వాణిజ్య వ్యాపార యజమానులు
ఖమ్మం నగరంలో బహుళ అంతస్థుల నిర్మాణంలో సెళ్ళార్లేని భవనాలెన్నో..?
సంబంధిత అధికారులు స్పందించేనా మాముళ్ళతో సరిపెట్టుకునేన?
ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏదైనా వర్తక వాణిజ్య వ్యాపారాలు నిర్వహించు కోవాల్సి వచ్చినప్పుడు సదరు భవన యజమాని ప్రభుత్వ అనుమతులను తీసుకొని నిర్మాణాలను నిర్వహించు కోవాల్సిఉంటుంది..
అయితే బహుళ అంతస్తుల నిర్మాణాల అంశంలో కొన్నిచోట్ల కొంతమంది బహుళ అంతస్తుల భవనాల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలకు అనుసరించకుండా చల్తాలే అనుకుంటు వ్యవహరించడం వల్ల ఏదైనావ్యాపారం కానీ లేదా ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు ఆ భవనంలో ఏర్పాటు చేసినప్పుడు ఆసుపత్రికి వచ్చే వారికి పార్కింగ్ లేక ఇష్టానుసారంగా రోడ్లపై వాహనాల నిలుపుదల మిగతా ప్రయాణికుల కు ఎంతో ఇబ్బంది కలుగుతుంది
ఖమ్మంలో రోజు రోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకొని పార్కింగ్ స్థలం లేని ఆసుపత్రి నిర్వహకులపై చర్యలు తీసుకొని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని వాహనదారులు కోరుకుంటున్నారు. వారితో పాటు సొంత ఇల్లు కలిగిన వారి ఇంటిముందు కూడా ఆసుపత్రికి వచ్చే వారు పార్కింగ్ చేయడంతో వారు ఎవరో కూడా తెలియకుండా వీరి వాహనానికి పార్కింగ్ లేక ఇక్కట్లు పడుతున్నారు
భవన యజమానికి చెందిన వాహన యజమానులు తమ వాహనాలను ఆసుపత్రి ఎదుట నిలుపుదల చేయకుండా మరో ప్రాంతం చోట నిలుపుదల చేసినప్పుడు (అక్రమ పార్కింగ్) సమీపంలో ఉన్న గృహ యజమానులు, వాణిజ్య వ్యాపార సంస్థల యజమానులకు తలనొప్పిగా మారాయా..?…కార్లు ఇతర పెద్ద వాహనాలు నిలుపుదల చేసినప్పుడు ఈప్రాంతం మాది..
మీ యొక్క వాహనాలు ఇక్కడ నిలపవద్దని సదరు గృహ యజమానులు వాణిజ్య వ్యాపార సంస్థల యజమానులు వాహన దారుడితో వాదిoచగా చర్చలు కాస్త వివాదంగా మారుతున్నాయా…? ఇంతకు ఈ వాహనాల నిలుపుదల మరో ప్రాంతంలోకి ఎందుకు..? అసలు వాహనాల నిలుపుదలకి ఈవివాదాలకి ప్రధాన కారణం ఎవరు..? అంటే కార్పొరేట్ స్థాయి వైద్యశాల కానీ, ఇతర వర్తక వాణిజ్య వ్యాపార రంగాల కోసం నాలుగు, ఐదు అంతస్థుల భవనాలను నిర్మించినప్పుడు సదరు కార్పొరేషన్ శాఖ నిబంధనల మేరకు వాహనాల పార్కింగ్ కోసం సెల్లార్… మరియు పార్కింగ్ ప్రాంతాన్ని నిర్దేశిస్తుంది..అలా ప్రభుత్వ అనుమతులు, నిబంధనలకనుగుణంగా బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు జరిగినప్పుడు ఇలాంటి సమస్యలు ఉత్పన్న మయ్యేవికావని ఖమ్మం నగర ప్రజలు ఆరోపిస్తున్నారు..
భవన యజమాని..ఎప్పటికీ తమ భవన నిర్మాణ సముదాయం ఎప్పటికీ పూర్తవుతుంది.. త్వరగా తమ వ్యాపార లావాదేవీలను ముందస్తుగా ప్రారంభించుకుందామా.. నాలుగు కాసులను వెనకేసుకుందామా…? ఈ సమాజంలో అందరికంటే ముందు తామే ఉందామా..? అనే ధోరణిలో కొంతమంది తమ భవన సముదాయ నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు… ప్రభుత్వం తమ శ్రద్ధను కనబరచకపోవడమే ప్రధాన కారణమని కొంతమంది ఆరోపిస్తున్నారు…
కోట్లు ఖర్చుపెట్టి బహుళ అంతస్తుల నిర్మాణం చేసినప్పుడు ఆయొక్క వ్యాపార సముదాయం వద్దకు వచ్చేవారు కానీ.. ఒకవేళ ఆభవన సముదాయంలో ప్రైవేటు ఆసుపత్రిని నెలకొల్పితే..ఆసుపత్రికి వచ్చే రోగుల ద్విచక్ర ఇతర పెద్ద వాహనాల పార్కింగ్ కోసం స్థలాన్ని కచ్చితంగా ఆ భవన సముదాయ యజమాని చూపాల్సి ఉంటుందని, అపుడే ఇలాంటి సమస్యలు తలుకుతాయి తలెత్తవని ఖమ్మం ప్రజానీకం ఆరోపిస్తోంది.. కొన్ని ప్రైవేటు వైద్యశాలలో తాము చెప్పిందే వేదం..తమకు చెప్పేది ఎవరు లే..?
ఒకవేళ ఎవరైనా అడ్డు చెప్పితే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, దృఢంగా ఉన్నామని ధైర్యం వారిలో లేకపోలేదనే అనుమానాలు ప్రజల్లో మెండుగా ఉన్నాయి.. ఖమ్మం నియోజకవర్గంలో కొంతమంది మొండి వైఖరిని అవలంబిస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణాల యజమానులు నిర్లక్ష్య తీరుపై ప్రజలు ఆగ్రహం చేస్తున్నారు..
ఇప్పటికైనా బహుళ అంతస్థుల యజమానులు ప్రభుత్వo సూచించిన పార్కింగ్ స్థలాన్ని భవన సముదాయంలోని ఏర్పాటు చేయాలని, ఇతర ప్రాంతాలలో వాహనాలు నిలపాల్సి వస్తే విభేదాలు, తగాదాలు, జగడాలు లేకుండా సామరస్య పూరిత ధోరణితో ఉంటేనే వివాదాలు గొడవలు జరగవని ప్రజలు పేర్కొంటున్నారు.ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఖమ్మంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు
పార్కింగ్ లేని ప్రైవేటు హాస్పిటల్స్ పై సికె న్యూస్ ప్రత్యేక కథనం రేపటి సంచికలో….