డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జన్మదినాన మద్యం మాంసం విక్రయాలను ప్రభుత్వం నిలుపుదల చేయాలి
బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పోతుల జ్ఞానయ్య
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) ఏప్రిల్ 08
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జన్మదినం ఏప్రిల్ 14 దేశవ్యాప్తంగా మద్యం మాంసం విక్రయాలను ప్రభుత్వం నిలుపుదల చేయాలని వివిధ పార్టీల స్వచ్ఛంద సంస్థ సంఘాల నాయకులు కోరారు.
సోమవారం నాయకులు మాట్లాడుతూ స్వాతంత్రం సిద్ధించిన రోజున బాపూజీ జన్మదిన రోజున అలాగే రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున దేశవ్యాప్తంగా మద్యం మాంసం విక్రయాలను నిషేధించిన విధముగా సువిశాల భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన
మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు అయిన ఏప్రిల్ 14వ తేదీన కనీసం తెలంగాణ రాష్ట్రంలో ను మరియు మన పట్టణంలోనూ మద్యం మాంసం విక్రయాలను నిషేధించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్టర్ పోస్టుల ద్వారా మరియు మున్సిపల్ కమిషనర్ హుజూర్నగర్ కు వినతి పత్రం ద్వారా విన్నపాలు వినతి పత్రం సమర్పించారు
ఇట్టి కార్యక్రమంలో పోతుల జ్ఞానయ్య బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు. దగ్గుపాటి బాబురావు డి ఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్. పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గొట్టముక్కల రాములు మాజీ వార్డు మెంబర్,తుమ్మ కొమ్మ యోనా,వినతిపత్రం సమర్పించినారు.