వైరాలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ..
ఏప్రిల్ 8,సీకే న్యూస్ ప్రతినిధి విజయ్
వైరా మున్సిపాలిటీ పరిధిలో రంజాన్ పండుగ జరుపుకోలేని నిరుపేద కుటుంబాలు ఆనందోత్సవాల మధ్య రంజాన్ పండుగ జరుపుకోవాలనే లక్ష్యంతో వైరా మున్సిపాలిటీ పరిధి లోని హాజ్రత్ అలి ఇబ్నే అబీ తాలిబ్ మసీదుకి సంభందించిన అల్ ఫలాహ్ యూత్ కమిటీ సభ్యుల కృషి.
దాతల సహకారంతో విరాళాలు సేకరించి మున్సిపాలిటీ పరిధి లోని సుమారు 45 నిరుపేద కుటుంబాలను గుర్తించి అల్ ఫలాహ్ యూత్ కమిటీ అధ్యక్షుడు షేక్. మొహమ్మద్ రిజ్వాన్ ఆధ్వర్యంలో ఒక్కో నిరుపేద కుటుంబానికి 15 కేజీల బియ్యం, ఏడు రకాల నిత్యవసర వస్తువులతో పాటు కొంత నగదును రంజాన్ తోఫా కింద పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ అధ్యక్షుడు షేక్ మీరా, వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ మీరా సాహెబ్, యూత్ కమిటీ ఉపాధ్యక్షుడు షేక్ ఖలీల్, యూత్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ రహీం ఖురేషి, సెక్రటరీ పఠాన్ యాకుబ్ జానీ, ట్రెజరరీలు షేక్ సలీం, షేక్ నయీం, యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.