ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించి మన్ననలు పొందండి..;;; డీఎంఎచ్ వో. డాక్టర్ బి మాలతి..
ఖమ్మంలో బాలాజీ మల్టీస్పెషాలిటీ వైద్యశాల ప్రారంభo…
నిరుపేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించి రోగులు వారి సహాయకుల మన్ననలు పొందాలని ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి మాలతి అన్నారు..
మంగళవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని స్థానిక వైరా రోడ్ ప్రాంతంలో గల నూతన బాలాజీ మల్టీ స్పెషాలిటీ వైద్యశాలను ప్రారంభించారు.
నూతన వైద్యశాలను ప్రారంభోత్సవంలో భాగంగా ప్రధాన విభాగాలను ఐ.ఎం.ఏ. అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు డాక్టర్ కంభంపాటి నారాయణరావు, డాక్టర్ జగదీష్, డాక్టర్ కూరపాటి ప్రదీప్ లు ప్రారంభించారు.ఈసందర్భంగా డి.ఎం.అండ్.హెచ్.ఓ. డాక్టర్.బి.మాలతి మాట్లాడుతూ.. నిరుపేద రోగులకు నాణ్యమైన వైద్యంతో పాటు రాయితీ విధానంలో వైద్య సేవలందించి ప్రజల మన్నానలు పొందాలని ఆమె ఆకాంక్షించారు.. వైద్య సేవలను సామాజిక సేవల కోణంతో అందిoచినపుడే మానవ జన్మకు సార్ధకత ఏర్పడుతుందనేది తన భావన అని, ఆ దిశగా ప్రైవేటు వైద్య శాలల యాజమన్యాలు, వైద్యులు, ఆలోచన చేయాలని కోరారు.. కరోణ సమయంలో డాక్టర్ జి శ్యాం కుమార్ తో పాటు అనేకమంది వైద్యులు ప్రాణాలు పణంగా పెట్టి ప్రభుత్వ ప్రైవేట్ వైద్యశాలల్లో కూడా వైద్య సేవలు అందించి ఆనాడు అనేక మంది ప్రాణాలు కాపాడారని ఆమె ఈసందర్భంగా గుర్తు చేశారు..
అనంతరం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ఖమ్మంపాటి నారాయణరావు, డాక్టర్ జగదీష్ చిన్నపిల్లల ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ లు మాట్లాడుతూ.. వైద్యవృత్తిని కత్తి మీద సామూలాంటిదని ప్రాణాపాయస్థితిలో ఉన్న వ్యక్తుల ప్రాణాలను కాపాడే క్రమంలో వైద్యులు ఎంతో వ్యయ ప్రయాసలకుర్చి రోగి ప్రాణాలు నిలుపుతారని వారన్నారు.. ఈ కార్యక్రమంలో శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ వైద్యశాల అధినేత దంపతులు డాక్టర్ జి శ్యామ్ కుమార్, సతీమణి, కుటుంబ సభ్యులు, ఆర్ఎంపి వైద్యుల సంఘం అధ్యక్షులు పిట్టల.వెంకటనరసయ్య, తదితరులు పాల్గొన్నారు…