రూ. 3,03,850/- విలువ గల గంజాయి పట్టివేత.
భద్రాచలం పోలీస్.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
ఏప్రిల్ 13,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఉత్తర్వుల మేరకు, భద్రాచలం, ఆర్టీసీ అవుట్ గేటు వద్ద శ్రీనివాస్ ఎస్సై మరియు పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ విధులలో భాగంగా భద్రాచలం టౌన్ నైట్ పెట్రోలింగ్ చేస్తుండగా జుమ్మేరత్ రోడ్, బేగం బజార్, అఫ్జాల్ గంజ్ ఏరియా,
హైదరాబాద్ కు చెందిన 1) ప్రశాంత్ మాకడియా అను వ్యక్తి ఆర్టీసీ అవుట్ గేటు వద్ద అనుమానాస్పదంగా ఉండగా, అతని యొక్క లగేజ్ బ్యాగును తనికీ చేయగా దాని యందు గంజాయి ఉన్నట్టుగా గుర్తించి ప్రశ్నించగా, తాను మరియు తన ఏరియాలో నివాసం ఉండే విక్రమ్ సింగ్ ఇద్దరు జల్సాలకు అలవాటు జల్సాలకు డబ్బులు సరిపోకపోవటంతో ఎలాగైనా డబ్బులు సులువుగా సంపాదించాలనే ఉద్దేశంతో, ఒడిస్స రాష్ట్రం కు చెందిన పుష్ప అను గంజాయి వ్యాపారి గంజాయిని కొనుగోలు చేసి అక్రమ రవాణ చేసి, హైదరాబాద్ లో గుర్తుతెలియని వ్యక్తులకు అమ్మి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో,
ప్రశాంత్ మాకడియా అను వ్యక్తి హైదరాబాద్ నుండి బస్సులో బయలుదేరి, అర్ధ రాత్రి సమయంలో భద్రాచలం చేరుకొని, రాత్రి సమయంలోనే నెల్లిపాక గ్రామానికి వెళ్లి సదరు పుష్ప ని నెల్లిపాక వద్ద కలిసి అతని వద్ద గల సుమారు 12 కేజీల బరువు గల 3 ప్యాకెట్లు తీసుకొని నా వద్ద గల లగేజ్ బ్యాగులో వేసుకొని నెల్లిపాక నుండి భద్రాచలం మీదుగా హైదరాబాదుకు వెళ్లి అక్కడ విక్రమ్ సింగ్ కు అట్టి గంజాయిని ఇవ్వడానికి తీసుకెళ్ళుతున్న క్రమంలో భద్రాచలం, ఆర్టీసీ అవుట్ గేటు వద్ద ప్రశాంత్ మాకడియా అను వ్యక్తిని పట్టుకోవడం జరిగింది.
ఇట్టి పట్టుబడిన నిందితుడి వద్ద నుండి 12.154 కిలోల గంజాయి, ఒక సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. భద్రాచలం టౌన్ సిఐ సంజీవరావు కేసు నమోదు చేసి, గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన ప్రశాంత్ మాకడియా అను నిందితుదిని రిమాండ్ కు తరలించి, మిగతా వ్యక్తుల గురించి దర్యాప్తు చేపట్టడం జరిగింది.