బడికి గుడికి పక్కనే మద్యం షాపులు
నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపుల యజమానుల దందా
పట్టించుకోని సంబంధిత అధికారులు
సీకే న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గ బాదావత్ హాథిరాం నాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం పలు గ్రామాలలో గుడుల పక్కన బడుల పక్కన బెల్ట్ షాపుల దందా ప్రభుత్వం నిబంధన ప్రకారం 100 మీటర్ల డిస్టెన్స్ ఉండాల్సి ఉండగా పైగా ఎలక్షన్ల నిబంధనల ప్రకారం బెల్టు షాపులు నిషేధించినప్పటికీ రెచ్చిపోతున్న బెల్ట్ షాపు యజమానుల పట్టించుకోని సంబంధిత అధికారులు జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామం నందు ఒకపక్క శివాలయం ఒకపక్క కోట మైసమ్మ తల్లి దేవాలయం దేవాలయానికి 15 మీటర్లు దూరంలోనే బెల్టు షాపుల దందా అంతా ఇంతా కాదు 24 గంటలు షమీ వైన్ షాప్ లాగా అమ్మటం గమనార్ధం ఈమధ్య కాలంలోనే ఆ బెల్ట్ షాపుల యజమాల మద్యం 1,50,000 మధ్యన్ని జూలూరుపాడు పోలీసు వారు సీజ్ చేసినప్పటికీ ఆ బెల్ట్ షాపు యజమానులు రాజకీయ నాయకుల అండదండలతో సినిమా పక్కిలో తగ్గేదే లేదంటూ పలు గ్రామాల్లో ఎలక్షన్ల నిబంధన ప్రకారం మద్యం నిషేధం ఉండటం వలన పలు గ్రామాల మందు ప్రియులు పాపులకు విచ్చేస్తూ ఈ మద్యం షాపు లో ఫ్లోటింగ్ పెరగటం యజమానులకు ఎక్కువ లాభం చేకూర్చినట్టు సమాచారం మద్యం షాపు యజమానులు ఇదే అదునుగా పాపకొల్లు శివారు ప్రాంతాలలో ఎక్కడ మద్యం దొరకనందున యజమానులు వారి ఇష్టానుసారం రేట్లు పెంచటం మద్యం ప్రియులను దోచుకున్నట్లు సమాచారం ఇకనైనా సంబంధిత అధికారులు ఈ అక్రమ మధ్య బెల్ట్ షాపులను అమ్మకుండా ఆపి మందు ప్రియుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న బెల్ట్ షాప్ మద్యం యజమాలను ఆగడాలను అరికట్టగలరని సంబంధిత శాఖ అధికారులను ప్రజలు విన్నవించుకుంటున్నారు