బస్సు ఆపలేదని.. ఆర్టీసీ డ్రైవర్‌పై చెయ్ చేసుకున్న ఉపాధ్యాయుడు..
బస్సు ఆపనందుకు పిడిగుద్దులు
అడ్డు వచ్చిన మహిళా కండక్టర్‌పై బూతుపురాణం
నిందితుడిపై చేయి చేసుకున్న ప్రయాణికులు
కామారెడ్డి:ఆపమన్న చోట బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు పిడిగుద్దులతో దాడి చేసిన ఘటన సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ నుంచి కామారెడ్డి రూట్ ఆర్టీసీ బస్సులో ఐండ్ల శ్రీనివాస్ డ్రైవర్‌గా, కండక్టర్‌గా విమల విధులు నిర్వహిస్తున్నారు. అదే బస్సు లో ప్రయాణించినసదాశివనగర్ మండలం యా చారం తండాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు లకావత్ శ్రీనివాస్ కామారెడ్డి పట్టణ సమీపంలోని పాత కలెక్టరేట్ వద్ద బస్సు ఆపాలని కండక్టర్‌ను కోరాడు.
రోదిస్తున్న మహిళా కండక్టర్ : కొంచం ముందుకు వెళ్లాక బస్సు ఆపడంతో ఆగ్రహంతో ఉపాధ్యాయుడు ప్రయాణికుల చూ స్తుండగా డ్రైవర్‌పై పిడిగుద్దులతో విచక్షణారహితంగా దాడి చేసాడు. అడ్డు వచ్చిన మహిళ కండక్టర్‌ను బూతు పురాణంతో దూషించాడు. ప్రయాణి కులు అడ్డువచ్చినా వినలేదు. దీంతో డ్రైవర్ అలాగే బస్సు ను కామారెడ్డి బస్టాండ్ వరకు తీసుకెళ్లారు. ఈ క్ర మంలో ప్రయాణికులంతా దాడి చేసిన వ్యక్తిని బ స్టాండ్‌లో నిలదీసారు.
తప్పంతా నీదేనని కొందరు ప్రయాణికులు ఆ టీచర్‌పై చేయి చేసుకున్నారు. తనను అనరాని మాటలతో దూషించాడని మహిళ కండక్టర్ రోదిస్తూ ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసింది. దాడి చేసిన వ్యక్తి గాంధారి మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నా డు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.