ఘనంగా గ్రంథాలయ ప్రారంభోత్సవం
— రూ.2కోట్ల సొంత నిధులతో నిర్మించిన ఎంపీ పార్థసారధిరెడ్డి.
సీకే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.
సత్తుపల్లి పట్టణంలో రెండు కోట్ల రూపాయల వ్యయం తో నిర్మించిన గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే మట్టా రాగమయి తో కలిసి రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి ప్రారంభించారు.
పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారి పక్కన రెండు కోట్ల రూపాయల వ్యయంతో బండి పార్థసారథి రెడ్డి సొంత నిధులతో గ్రంథాలయాన్ని నిర్మించారు.గ్రంథాలయంలో అత్యాధునిక సౌకర్యాలను,పుస్తకాలను,కంప్యూటర్ ల్యాబ్ ను ఏర్పాటు చేసినట్లు ఎంపీ బండి పార్థసారథి రెడ్డి పేర్కొన్నారు.
ఎంపీ పూజలు నిర్వహించన అనంతరం నూతన గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థకు అప్పగించినారు. ఇందులో రెండు కాన్ఫరెన్స్ హాళ్లు, డిజిటల్ లైబ్రరీ ఉండడమే కాక ఇతర వసతులు కల్పించినారు. ఎంపీ బండి పార్థసారధిరెడ్డి సత్తుపల్లిలో చదువు కోగా, ఇక్కడి జ్ఞాపకాలను పలుమార్లు గుర్తుచేస్తూ .
ఈ ప్రాంత విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పడాలనే సంకల్పంతో రాజ్యసభ సభ్యుడి హోదాలో తొలిసారి సత్తుపల్లికి వచ్చినప్పుడు గ్రంథాలయ నిర్మాణానికి హామీ ఇచ్చారు. అన్ని సౌక ర్యాలు, అవకాశాలు కల్పిస్తే ఇక్కడ విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణిస్తారనే సంకల్పంతో రూ.2కోట్ల నిధులతో ఈ లైబ్రరీని నిర్మించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి, గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ చైర్మన్ వనమా వాసు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, కొత్తూరు ప్రభాకర్ రావు ,నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.