వైద్యం వికటించి బాలింత మృతి…
కుటుంబ సభ్యుల ఆరోపణ
సీకే న్యూస్ ప్రతినిధి బాదావత్ హాథిరాం నాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఎంసిహెచ్ ఆసుపత్రిలో వైద్యం వికటించడంతో బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రసవం కోసం వచ్చిన మహిళ ప్రాణాలు కోల్పోయిందనీ బంధువులు ఆరోపిస్తున్నారు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం టాక్య తండా గ్రామానికి చెందిన బానోత్ చంద్ర(27) మొదటి కాన్పు ప్రసవం కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాత శిశు కేంద్ర ఆస్పత్రిలో బుధవారం ఉదయం చేరింది.
వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం రాత్రి సుమారు 11 గంటలకు సాధారణ ప్రసవం చేశారు. ప్రసవం అనంతరం బాలింతకు రక్తస్రావం ఆగకపోవడంతో ఆపరేషన్ చేసి గర్భసంచిని తొలగించారు. అప్పటికే రక్త స్రావం అధికంగా జరగడంతో కార్డియాక్ అరెస్టు అయి గురువారం ఉదయం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో చంద్ర మృతి చెందిందని వైద్యులు తెలుపుతున్నారు.
బంధువులు మాత్రం ఇది వైద్యుల నిర్లక్ష్యమేనని ఆరోపిస్తున్నారు. అయితే మాత శిశు కేంద్రంలో వైద్యులుగా విధులు నిర్వహిస్తున్న గైనకాలజిస్ట్ డాక్టర్లకు సొంత ప్రైవేట్ ఆసుపత్రిలు ఉండడంతో ఇక్కడ వైద్యంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎక్కువ దృష్టి తమ సొంత ఆసుపత్రులపైన కేటాయించడంతో ఇక్కడి రోగులకు సరైన వైద్యం అందించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
అందుకే ఎంసిహెచ్ ఆసుపత్రిలో వరుస బాలింత మరణాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.బాలింత మృతి…
జిల్లా కేంద్రంలోని ఎంసిహెచ్ ఆసుపత్రిలో వైద్యం వికటించడంతో బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రసవం కోసం వచ్చిన మహిళ ప్రాణాలు కోల్పోయిందనీ బంధువులు ఆరోపిస్తున్నారు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం టాక్య తండా గ్రామానికి చెందిన బానోత్ చంద్ర(27) మొదటి కాన్పు ప్రసవం కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాత శిశు కేంద్ర ఆస్పత్రిలో బుధవారం ఉదయం చేరింది.
వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం రాత్రి సుమారు 11 గంటలకు సాధారణ ప్రసవం చేశారు. ప్రసవం అనంతరం బాలింతకు రక్తస్రావం ఆగకపోవడంతో ఆపరేషన్ చేసి గర్భసంచిని తొలగించారు. అప్పటికే రక్త స్రావం అధికంగా జరగడంతో కార్డియాక్ అరెస్టు అయి గురువారం ఉదయం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో చంద్ర మృతి చెందిందని వైద్యులు తెలుపుతున్నారు.
బంధువులు మాత్రం ఇది వైద్యుల నిర్లక్ష్యమేనని ఆరోపిస్తున్నారు. అయితే మాత శిశు కేంద్రంలో వైద్యులుగా విధులు నిర్వహిస్తున్న గైనకాలజిస్ట్ డాక్టర్లకు సొంత ప్రైవేట్ ఆసుపత్రిలు ఉండడంతో ఇక్కడ వైద్యంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఎక్కువ దృష్టి తమ సొంత ఆసుపత్రులపైన కేటాయించడంతో ఇక్కడి రోగులకు సరైన వైద్యం అందించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అందుకే ఎంసిహెచ్ ఆసుపత్రిలో వరుస బాలింత మరణాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.