ఘనంగా మంగళవార్త దేవాలయ మహెూత్సవ వేడుక
భక్తిపారవశంతో ప్రత్యేక పూజలు చేసిన క్రైస్తవ విశ్వాసులు
ఏసుక్రీస్తు పాపులను రక్షించుటకే ఈ భూమికి వచ్చారు
విచారణ గురువులు
ఫాదర్ మార్టిన్ పసల
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య (జయరాజ్) ఏప్రిల్ 25
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలోని మంగళ వార్త దేవాలయ పండుగ మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. దివ్యాబలి పూజలో ఫాథర్ మార్టిన్ పసల మాట్లాడుతూ ఈ కడవరి దినములలో మనుషుల మధ్య ప్రేమ ఆప్యాయత అనురాగం అంతరించి పోతుందని కుల మత భేదాలు లేకుండా మనుషులందరూ ఐక్యంగా ఉండి ఉన్నవారు లేని వారు అని తేడా లేకుండా జీవితంలో ప్రతి ఒక్కరూ సోదరభావంతో కలసి మెలసి జీవించాలని జీవిత పరమార్థం తెలుసుకొని క్రీస్తు జనన మరణ పునరుత్థానం యొక్క సందేశాన్ని ప్రజలందరూ తెలుసుకొని సమాధానంతో క్రీస్తు ప్రేమలో జీవించాలని యేసు క్రీస్తు పాపులకొరకే ఈ భూమికి వచ్చారని నీతి మంతుల కొరకు కాదని ఆయన మన పాపముల కొరకు సిలువ వేయబడి మరణము నొంది తిరిగి లేవారని అన్నారు.
ఈ పండుగలో మంగళ వార్త దేవాలయాన్ని ప్రతి క్రైస్తవ విశ్వాసులు బంధు మిత్రులు కుటుంబ సమేతంగా వచ్చి దేవాలయాన్ని సందర్శించి దేవుని దీవెనలు పొంది క్రీస్తు ప్రేమలో జీవించాలని అన్నారు.అనంతరం ఫాదర్స్,సిస్టర్ ను చర్చి కమిటీ పెద్దలు శుభోదయ యువజన సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు.
మధ్యన్యం 3 గం లకు ఒత్తుల సమర్పణ సాయంత్రం 5 గం లకు భక్తులు ప్రత్యేక గీతాలాపన లతో గ్రామ వీధుల్లో తేరు ప్రదక్షిణ చేస్తూ ఆలయ అవరణలోకి రాగా దివ్య సత్ ప్రసాద ఆరాధన జరిగింది 8 గంలకు దేవాలయ ఆవరణలో వినూత్న రీతిలో టపాసులు కాల్చారు
ఇట్టి కార్యక్రమంలో చర్చి కమిటీ పెద్దలు గోపు బాల్ రెడ్డి గాదె జార్జిరెడ్డి, బోయపాటి అంతోనిరెడ్డి,సంఘం ఆంటోని, కొమ్మారెడ్డి బాల్ రెడ్డి, తుమ్మా జోసెఫ్ రెడ్డి , తిరుమలరెడ్డి బాల శౌరెడ్డి రాయ చిన్నపు రెడ్డి తుమ్మ జోసెఫ్ రెడ్డి శుభోదయ యువజన సంఘ అధ్యక్షులు గాదె జయభారత్ రెడ్డి సంఘం, సభ్యులు గాదె పవన్ రెడ్డి ,తానం బాల రెడ్డి,కందుల కిరణ్ కుమార్ రెడ్డి,సలిబండ్ల రాజేష్ రెడ్డి కొమ్మా రెడ్డి రంజిత్ రెడ్డి గోపు అఖిల్ రెడ్డి మరియు దివ్యబలి పూజా కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల పలు విచారణ చర్చి ఫాదర్లు, మఠ కన్యలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.