కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోరుతూ ఇంటింటా ప్రచారం….
సి కే న్యూస్ (సంపత్) మే 05
ఆలేరు పట్టణం నాలుగో వార్డ్ లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదేశానుసారం ఆదివారం కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది.
చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంటు సభ్యుడు హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం ఆలేరు టౌన్ అధ్యక్షుడు ఎం ఏ ఎజాస్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ గుత్త శమంతా రెడ్డి,ఆలేరు టౌన్ మత్స్యశాఖ అధ్యక్షుడు బరిగే శ్రీనివాస్,బొద్దుల మంగ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..