గాలి వానకి కొట్టుకుపోయిన బిజెపి సభా ప్రాంగణం..
మండుతున్న ఎండలకు బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
పెద్దపల్లి జిల్లా ధర్మపురి,పెద్దపల్లి,మంథని, నియోజకవర్గాల్లో ఉరుములు ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది.
పలు చోట్ల దాన్యం తడుస్తుండటంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు.
రేపు మే 8, 2024న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే అక్కడ గాలి వాన బీభత్సం సృష్టించడంతో సభా ప్రాంగణం మొత్తం అతలాకుతలం అయ్యింది. సభలో ఏర్పాటు చేసిన కుర్చీలు, టెంట్లు గాలి వేగానికి కొట్టుకపోయాయి. సభ ప్రాంగణం లోని చేరిన భారీగా వర్షం నీరు వచ్చి చేరాయి. ఈ క్రమంలోనే మోదీ సభ ఉంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు పడవచ్చని టీఎస్‌డీపీఎస్ వెల్లడించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.