వనపర్తి , గద్వాల్ జిల్లాలు రద్దయితే పని చేయమంటున్న క్షేత్రస్థాయి కాంగ్రెస్ లీడర్స్
సీ కే న్యూస్ ప్రతినిధి, కొల్లాపూర్:
వనపర్తి, జోగులాంబ జిల్లాల రద్దు తప్పదా..?
ఎంపీ ఎలక్షన్లో “ఆర్ఎస్పీ” కి కలిసొస్తున్న “గద్వాల , వనపర్తి” జిల్లా ప్రాంత వాసులు
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోనే ఆ జిల్లాలు రద్దు కాకుండా ఉంటాయి
జిల్లాల రద్దుతో కేసీఆర్ వైపు చూస్తున్న జనం
అయోమయంలో కాంగ్రెస్ శ్రేణులు… నోరు విప్పని రేవంత్
నాగర్ కర్నూల్ పార్లమెంట్ ప్రాంతంలో విద్యాభివృద్ధి జరగాలంటే …, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గెలిపించాలి
నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానంలో విద్యాభివృద్ధి జరగాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గెలిపించాలని ఈ ప్రాంతం మేధావులు పిలుపునిస్తున్నారు.
జోగులాంబ(గద్వాల) జిల్లా వనపర్తి జిల్లాలు రద్దు తప్పదా…? అంటూ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఆ రెండు జిల్లాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు .
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రద్దుకు ఏర్పాటు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు గద్వాల జిల్లా నీ మహబూబ్నగర్లో వనపర్తి ని నాగర్ కర్నూల్ జిల్లాలో కలిపి ఉండే విధంగా జిల్లాలో ఏర్పాటు జరుగుతున్నదని వస్తున్న వార్తల పట్ల ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఇలా అయితే మేము ఎలా జీవనం కొనసాగించాలి అంటూ వారు తలబాదుకుంటున్నారు వ్యాపారవేత్తలు ఎన్నో టెన్షన్లకు గురవుతున్నారు ఈనెల 5న గద్వాలలో జరిగే రాహుల్ గాంధీ సభకు ప్రజలు ఆయా ప్రాంతాల రైతులు,కూలీలు భారీగా తరలి వెళ్తారన్న నమ్మకం లేకుండా పోతుందన్న అంశాలు చూస్తుంటే సభకు నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయని, వద్దంతులు వస్తున్నాయి.
జోగులాంబ గద్వాల జిల్లా వనపర్తి జిల్లా రద్దు అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ,లీడర్లు క్షేత్రస్థాయిలో పనిచేయడానికి ఇబ్బంది కలుగుతుందని కార్యకర్తలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు విచిత్ర, వింత నిర్ణయాల పట్ల ప్రజలే కాదు కార్యకర్తలు కూడా మదన పడుతున్నారు. దీనితో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా ఉందని, అందుకే బీఆర్ఎస్ పార్టీ దూసుకు వెళుతున్నదని, గ్రామాలలో ప్రజలు అంటున్నారు.
అందుకే గత రెండు మూడు రోజులుగా గ్రామాలలో నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గాలలో ప్రజలు బీఆర్ఎస్ వైపు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వైపు మొగ్గు చూపుతున్నారు. గ్రామాలలో ప్రజలలో వద్దంతులు మెండుగా కనిపిస్తున్నాయి.
గతంలో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యాభివృద్ధి కోసం విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా గురుకుల పాఠశాల ఏర్పాటుచేసి ప్రజల మన్ననలు పొందారు.
అదే విధంగా నేడు జరుగుతున్న ఎన్నికల్లో తనకు గ్రామాలలో మద్దతు పెరుగుతున్నది. అయితే రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు కెసిఆర్ అవసరము అని ప్రజలు భావిస్తున్నారు. అందుకే రేపు జరగబోయే ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్లో ప్రతిపక్షం పార్టీగా ఉన్న బీఆర్ఎస్ అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తున్నది.
ప్రస్తుతం వనపర్తి గద్వాల జిల్లా ల ప్రజలు నాగర్ కర్నూల్ ఎంపీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గెలిపించుకుంటే జిల్లాల రద్దు అనేది జరగదని ప్రాంత ప్రజలు ఆలోచనలో మునిగారు దీనిని బట్టి చూస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఆ జిల్లాల ప్రజలు భారీ మెజార్టీ ఇవ్వబోతున్నారని పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి ఇక ఏం జరుగుతుందో దీని గురించి మనమంతా వేచి చూడాల్సిందే.