ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టులు.. పూర్తి వివరాలివే..
ఇంటర్ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి భారీ శుభవార్త. ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టుల భర్తీగా కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంటర్ పూర్తి చేసిన అవివాహిత పురుష, మహిళలు ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ ఖాళీల భర్తీకి సంబంధించి వయస్సు, పరీక్షా విధానం, జీతం వంటి మొదలైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు..
ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 13వ తేదీన ప్రారంభం కానుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి మే 27వ తేదీ వరకు అవకాశం ఉంటుంది.
విద్యార్హతలు..
కనీసం 50 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రధాన సజ్జెక్టులుగా ఇంటర్మీడియట్ లేదా రెండేళ్ల ఒకేషనల్ కోర్సు, ఇంజినీరింగ్ డిప్లొమా, తత్సమాన కోర్సుల్లో గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఉత్తీర్ణులైన ఉండాలి.
వయస్సు..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 01-11-2003 నుంచి 30-04-2007 సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలి.
మెడికల్ స్టాండర్డ్స్
పురుష, మహిళల ఎత్తు 157కంటే ఎక్కువ ఉండాలి.
పరీక్ష ఫీజు..
దరఖాస్తు ఫీజు రూ.550లను ఆన్ లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం
స్టేజ్-1.. కంప్యూటర్ ఆధారిత ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటుంది. ఇందులో ఎంపికైన వారికి స్టేజ్-2లో ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఈ రెండిట్లో ఉత్తీర్ణులైన వారికి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం https://indiannavy.nic.in/ అధికారిక వెబ్ సైట్ చూడగలరు.