దొంగలు బాబోయ్ దొంగలు….
సెల్ ఫోన్లు, పర్సులు, బైకులు మాయం
పట్టించుకోని అధికారులు
సీ సీ కెమెరాలు, పోలీసు ఔట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని ప్రయాణికుల డిమాండ్
సి కే న్యూస్ (సంపత్) మే 14
నిత్యం ముప్పై నుంచి నలబై వేల మంది ప్రయాణికులతో నిండి ఉండే భువనగిరి బస్ స్టేషన్లో దొంగల బెడద రోజు రోజుకు పెరిగి పోతుంది.నూతనంగా ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం తో మహిళల రద్దీ ఎక్కువ అవడంతో దొంగలు, తమ పనిని సులువుగా చేసుకుంటూ పోతున్నారు.
గత మూడు నెలల కాలంలోనే ముప్పై కి పైగా దొంగ తనాలు కేవలం భువనగిరి బస్ స్టేషన్ లోనే జరిగాయని తెలుస్తోంది.చాలా మంది బాధితులు పోలీసులకు పిర్యాదు చేయకుండానే వెళుతున్నారు.
ప్రధానంగా పోలీసు స్టేషన్ అందుబాటులో లేకపోవడం,పిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకుంటారనే నమ్మకం లేకపోవడం,బస్ స్టేషన్ లో పోలీస్ ఔట్ పోస్ట్ లేకపోవడం వల్ల బాదితుల పిర్యాదు చేయడానికి వెనుకాడుతున్నారు.
అద్దెల రూపంలో ప్రతి నెల పది లక్షల రూపాయిల ఆదాయం ఉన్నా, ఆర్టీసీ అధికారులు కనీసం ఇద్దరు హోం గార్డులను నియమించుకునే స్థితిలో లేరంటే, ప్రయాణికుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం అవుతుంది. జిల్లా కేంద్రంలోని భువనగిరి బస్ స్టేషన్ లో కేవలం ఒకే ఒక్క సీ సీ కెమెరా ఉండడం, అది కూడా పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం గమనార్హం.
ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగు పరచాలి
కొడారి వెంకటేష్
వినియోగదారులు సంఘం జిల్లా అధ్యక్షుడు
భువనగిరి బస్ స్టేషన్ లో తగినన్ని సీసీ కెమెరాలు, పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేసి దొంగల బారినుండి ప్రయాణికులను రక్షించాలని వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు.
భువనగిరి బస్ స్టేషన్ చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని,ప్రైవేటు వాహనాలు, ముఖ్యంగా ఆటోలు లోనికి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.