చనిపోతూ ఐదుగురికి పునర్జన్మ ఇచ్చిన మహిళా…
సెల్యూట్ చేసిన వైద్యులు..
మంచి చేస్తే.. అదే విధంగా మనల్ని గుర్తు పెట్టుకుంటారు. కొందరు చనిపోయి కూడా చిరంజీవులుగా ఉంటారు.
కారణం..తాము చనిపోతూ ఇతరుల జీవితాలకు వెలుగు నింపుతుంటారు. అన్ని దానాల్లోకెల్ల అవయదానం చాలా గొప్పది.
అందుకే ఊరికే మట్టిలో కలిసిపోయే అవయవాలను ఎవరికైనా దానం చేస్తే.. వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన వాళ్లం అవుతాము. అలా చాలా మంది తమ కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే.. అవయవదానానికి ముందుకు వస్తున్నారు. తాజాగా ఓ మహిళ ఐదు మందికి పునర్జన్మ ఇచ్చి..వారి కుటుంబాల్లో వెలుగు నింపింది.
తెలంగాణ ప్రాంతానికి చెందిన లక్ష్మీ దేవమ్మ తన కుటుంబంతో నివాసం ఉంటుంది. అయితే అనారోగ్య కారణంతో ఆమె కొన్నిరోజులు గా నిమ్స్ ఆస్పత్రి చికిత్స పొందుతుంది. ఈ క్రమంలోనే ఆమె ఇటీవల కన్నుమూశారు. దీంతో ఆమె వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ఇదే సమయంలో అవయదానం గురించి వైద్యులు మృతురాలి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. దీంతో తన తల్లి మరణం మరో ఐదుగురికి పునర్జన్మనిస్తుందని తెలుకున్న లక్ష్మీదేవమ్మ కుటుంబ సభ్యులు అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు.
నిమ్స్ ఆస్పత్రిలో ఆమె చనిపోగా..అవయవదానాలు చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. సదరు మహిళ 2 కిడ్నీలు, కాలేయం, రెండు నేత్రాలు దానం చేసినట్లు జీవన్ దాన్ ట్వీట్ చేసింది.
అన్ని దానాల్లో కంటే అవయవదానం ఎంతో గొప్పదని, కానీ దీనికి చాలా మంది ముందురారని జీవన్ దాన్ సభ్యులు తెలిపారు. అవయవాలు అందుబాటులో లేక వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
గతంలో కూడా అనేక మంది తమ కుటుంబ సభ్యుల అవయవదానాలు చేసేందుకు ముందుకు వచ్చారు. విశాఖపట్నంలో ఓ యువకుడు బ్రెయిన్ డెడ్ కాగా అతడి ఆర్గాన్స్ ను దానం చేసేందుకు అతడి తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. అలానే జగిత్యాల జిల్లాలు చెందిన ఓ మహిళ బ్రెయిన్ డెడ్ అయి చనిపోయింది.
ఆమె అవయవాలు దానం చేసి.. ఐదు కుటుంబాల్లో వెలుగులు నింపింది. ఇలా చాలా మంది ఆర్గాన్స్ దానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ఇంకా చాలా మంది అది ఏదో తప్పుగా లేక ఇతర భావనలు పెట్టుకుని ముందుకు రావడం లేదు.
అలా ఒక మనిషి చనిపోయిన తర్వాత వారి శరీరంలో నుంచి 200 అవయవాలు దానం చేసి కొంతమంది జీవితాలకు వెలుగునివ్వొచ్చు అని వైద్యులు చెబుతున్నారు. మనిషి ప్రాణం ఎంతో విలువైనది..
చనిపోయిన తర్వాత అవయవదానంతో మరికొందరి ప్రాణాలు నిలబెట్టవొచ్చు అంటారు. మరి.. ఈ మహిళ కుటుంబ సభ్యులు చేసిన మంచి పనిపై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలానే అందరు ముందుకు రావాలని వైద్యులు చెబుతున్నారు