ఏసీబీకి చిక్కిన ట్రాన్స్ కో ఏఈఈ
రైతు నుంచి రూ. లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి
అశ్వారావుపేట రూరల్: ఓ రైతు భూమిలో విద్యుత్లోన్, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు ట్రాన్స్ కో ఏఈఈ(ఆపరేషన్స్) రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ తెలిపిన వివ రాల ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన రైతు కొనకళ్ల జనార్దన్ రావుకు అశ్వారావుపేట మండలం మద్దికొండ( భీమునిగూడెం) సమీపాన ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది.
ఈ భూమిలో విద్యుత్ లైన్, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు రైతు కుమా రుడు ఆదిత్య నెల క్రితం మీ సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేశాడు. ఆ తర్వాత ట్రాన్స్కో ఏఈఈ(ఆపరేషన్స్) శరతుమార్ను కలిసి ఈ విషయం చెప్పగా రూ.1.81 లక్షలుగా అంచనా వేసి డీడీ రూపంలో చెల్లించాలని సూచించారు. ఆయన సూచన మేరకు ఆదిత్య డీడీ అందజేశాడు.
అయితే డీడీతో పాటు అదనంగా మరో రూ. లక్ష ఇవ్వాలని ఏఈఈ డిమాండ్ చేయగా, ఆదిత్య ఖమ్మం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ డీఎస్పీ రమేష్ బృందం రంగంలోకి దిగి.. బాధితుడి నుంచి స్థానిక శ్రీ లక్ష్మీ తులసీ అగ్రో పేపర్ బోర్డు వద్ద ఏఈఈ శరత్ కుమార్ రూ.లక్ష లంచం తీసుకుంటుడగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఈమేరకు పట్టుబడిన నగదును సీజ్ చేసి ఏఈఈపై కేసు నమోదు చేసి ఖమ్మం ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈ తనిఖీల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు ఎన్. శేఖర్, డి.సునీల్, మహేష్, హెడ్ కానిస్టే బుల్ పుల్లయ్య, సిబ్బంది శ్రీను, శ్రీనివాసా చారి, రంగా తదితరులు పాల్గొన్నారు.