Andhra PradeshPolitical

భర్తను రోజూ కొడుతున్న భార్య..

భర్తను రోజూ కొడుతున్న భార్య..

భర్తను రోజూ కొడుతున్న భార్య.. పోలీసుల ముందు గోడు వెళ్లబోసుకున్న భర్త

తన భార్య నుండి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని… రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకున్నారు.

పెళ్ళైనప్పటి నుండి తనను మానసికంగా , శారీరకంగా హింసిస్తుందని బాధితుడు ఆల్వాల్ పోలీస్ స్టేషన్ ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ఒంటిపై భార్య చేసిన గాయాలను చూపిస్తూ , మీడియాతో తన గోడును చెప్పుకున్నాడు.

ఏపీ రాజోలుకు చెందిన టెమూజియన్ కు అమలాపురంకు చెందిన లక్ష్మీ గౌతమితో ఏడేళ్ల క్రితం పెళ్లి జరగగా మల్లారెడ్డి కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు.

అయితే పెళ్లైనప్పటి నుండి తనను అకారణంగా హింసిస్తుందని, పలుమార్లు పెద్దవాళ్ళ సమక్షంలో మాట్లాడినా ఆమె తీరు మారలేదన్నారు. ఇటీవల తనను చంపేందుకు కత్తితో దాడి చేసినట్లు తెలిపాడు.

ఈ విషయంపై స్థానిక అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని… అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. మహిళలకు ఒక చట్టం , పురుషులకు ఒక చట్టం ఉంటుందా అని ప్రశ్నించారు.

తాను నిన్నటి నుండి ఇంటికి వెళ్లలేదని , వెళ్తే తన భార్య మళ్ళీ దాడి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు. పోలీసులు తన భార్యపై కేసు నమోదు చేసి , తనకు రక్షణ కల్పించాలని బాధిత భర్త వేడుకున్నాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button