రోడ్ పై మద్యం వ్యాన్ బోల్తా…
బాటిల్స్ తీసుకునేందుకు ఎగబడ్డ జనం
రోడ్డుపై డబ్బులు కనిపిస్తే ఎలా ఉంటదీ.. అటూ ఇటూ చూసి జేబులో పెట్టుకుంటాం కదా.. అదే నడి రోడ్డుపై బాటిళ్ల కొద్దీ లిక్కర్ బాటిళ్లు పడి ఉంటే..నా సామి రంగా జనం ఎగబడి ఎత్తుకుపోరా…
అలాంటి సిట్యువేషన్ 2024, మే 22వ తేదీ సాయంత్రం సికింద్రాబాద్ ఏరియాలోని బోయిన పల్లి మెయిన్ రోడ్డుపై జరిగింది.. వివరాల్లోకి వెళితే..
లిక్కర్ తయారీ కంపెనీ నుంచి వైన్ షాపులకు లిక్కర్ తరలిస్తున్న వ్యాన్.. నడిరోడ్డుపై బోల్తా పడింది. వ్యాన్ లోని లిక్కర్ బాటిళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో ట్రాఫిక్ జాం.. ఇదే సమయంలో రోడ్డుపై పడిన లిక్కర్ బాటిళ్లను అటువైపు వెళుతున్న జనం కొందరు ఎత్తుకుపోయారు. సరుకు అంతా హాట్.. లిస్కీ, బ్రాందీ, చీప్ లిక్కర్ బాటిళ్లు అవి.. చేతికి పట్టినన్ని.. జేబుల్లో సర్దుకుని వెళ్లారు జనం..,
ఇదే సమయంలో వ్యాన్ బోల్తా అయితే పడింది కానీ.. అందులోని డ్రైవర్, మరో వ్యక్తి సురక్షితంగానే ఉన్నారు. దీంతో వాళ్లు వ్యాన్ చుట్టూ కాపలాగా ఉన్నారు. లిక్కర్ బాటిళ్లు ఎత్తుకెళ్లకుండా జనాన్ని కంట్రోల్ చేశారు.
ఈలోపు పోలీసులు ఎంట్రీ ఇవ్వటం.. వైన్ షాపు సిబ్బంది, ఓనర్లు స్పాట్ కు వచ్చి రోడ్డుపై మిగిలిన లిక్కర్ బాటిళ్ల ను మరో వ్యాన్ లో ఎక్కించుకుని వెళ్లారు.
రోడ్డుపై అలా లిక్కర్ బాటిళ్లు కనిపిస్తుంటే.. చేతులు లాగుతుంటే.. నోరు లాగుతున్నా ఏమీ చేయలేక చూస్తూ వెళ్లిపోయారు చాలా మంది జనం..