భద్రాచలంలోని పారామెడికల్ కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని పారా మెడికల్ కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
నిన్న సాయంత్రం చనిపోయిన నర్సింగ్ విద్యార్థిని కారుణ్య బంధువులు కాలేజీ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
కళాశాల ప్రాంగణంలో గాయాలతో పడి ఉన్న కారుణ్యను విద్యార్థులు గుర్తించారు.
వెంటనే విద్యార్థిని కారుణ్యను హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి కాలేజీ యాజమాన్యం తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం కారుణ్య మృతి చెందింది.
విద్యార్థిని మృతితో పారామెడికల్ కళాశాల వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వాసుపత్రి నుంచి ర్యాలీగా కళాశాల వద్దకు బంధువులు తరలివచ్చారు. కారుణ్య కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు.
కళాశాలకు వచ్చిన ఛైర్మన్‌పై విద్యార్థులు, బంధువులు దాడికి యత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.