50 మంది ఫేక్ డాక్టర్ల గుట్టురట్టు…
ప్రస్తుత రోజుల్లో వైద్యం పేరుతో కార్పోరేట్ ఆసుపత్రుల యాజమాన్యం ప్రజలను పీడిస్తున్న విషయం విధితమే. ఈ కార్పోరేట్ల భారీన పడకుండా ఉండేందుకు బీద, మధ్యతరగతి కుటుంబాలు గళ్లీలో ఉండే చిన్న క్లినిక్ ల వద్దకు వెళుతుంటారు.కానీ ఆ క్లినిక్ ల పేరుతో ఎంతో మోసగాళ్లు డాక్టర్లుగా చలామణి అవుతూ వైద్య సేవలు చేస్తున్న విషయాన్ని గమణించుకోలేక పోతున్నారు.
ఈ నేపధ్యంలోనే తెలంగాణ వైద్య మండలి అధికారుల దాడులతో 50 మంది నఖిలీ వైద్యుల గుట్టు రట్టయ్యింది. హైదరాబాద్ మేడ్చల్ పరిధిలోని పలు క్లినిక్ లపై వైద్య మండలి అధికారులు తనిఖీలు నిర్వహించడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఐడీపీఎల్, షాపూర్ నగర్, చింతల్ ప్రాంతాల్లో ఎటువంటి అర్హతలు లేకుండా క్లినిక్ నడుపుతూ డాక్టర్లుగా చలామణి అవుతున్న 50 మంది ఫేక్ డాక్టర్లను అధికారులు గుర్తించారు. వీరు నిర్వహిస్తున్న క్లినిక్ లలో రోగులను చేర్చుకొని పెద్ద ఎత్తున యాంటీ బయాటిక్స్ ఉపయోగిస్తూ.. వైద్యం చేస్తున్నారని అధికారులు తెలుసుకున్నారు.
ఎటువంటి అర్హతలు లేకుండా వారికి తెలిసిన అరకొర వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వైద్యులుగా చెప్పుకోవడమే కాకుండా క్రినిక్ లకు అనుసందానంగా డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా నడుపుతున్నట్లు తెలిసింది.
అధికారులు గుర్తించిన ఈ 50 మంది ఫేక్ డాక్టర్లపై కేసులు నమోదు చెయ్యగా.. ఇద్దరిని రిమాండ్ కు తరలించారు. అంతేగాక వీరు నిల్వ ఉంచిన మందులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా నఖీలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అర్హత కలిగిన వైద్యుల వద్దకే వెళ్లాలని అధికారులు సూచించారు.