వైద్యుల నిర్లక్ష్యం.. పేషెంట్ మృతి
చైతన్యపురిలోని షణ్ముఖ హాస్పిటల్ ముందు ఓ వ్యక్తి కుటుంబీకులు ఆందోళనకు దిగారు. నేపాల్ రాష్ట్రానికి చెందిన కమల్ బహుదూర్ బతుకు దెరువు కోసం వచ్చి హైదరాబాద్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు.
ఈ సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నేపాల్ రాజధాని ఖాట్మండు కు చెందిన కమల్ బహుదూర్(38) బతుకుతెరువు కోసం నేపాల్ నుంచి కుటుంబ సభ్యులతో సహా నగరానికి వచ్చి కొద్దిరోజులు వాచ్ మెన్ గా పనిచేసే అటు నుండి నల్గొండ జిల్లా చిట్యాల దగ్గర ఓ కంపెనీలో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు.
కొద్దిరోజుల తర్వాత తన సొంత గ్రామమైన ఖాట్మండుకు వెళుతున్న తరుణంలో ఉత్తర ప్రదేశ్ రాజధాని పరిధిలోని లక్నోలో షార్ట్ సర్క్యూట్ కు గురైనాడు. 70 శాతం కాలిన గాయాలతో చికిత్స నిమిత్తం తిరిగి నగరానికి వచ్చి ఉస్మానియా ఆస్పత్రిలో అడ్మిట్ అయి చికిత్స పొందాడు.
తదుపరి మెరుగైన వైద్యం కోసం అత్తాపూర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందాడు. అక్కడ డబ్బులు కట్టలేక తిరిగి ఉస్మానియా హాస్పిటల్ కు వెళ్లాడు. చైతన్యపురి లోని షణ్ముఖ వైష్ణవి హాస్పిటల్ లో నాణ్యత గల వైద్యం అందించి అతని పూర్వస్థితికి తీసుకొస్తామని షణ్ముఖ వైష్ణవి హాస్పిటల్ మేనేజ్మెంట్ హామీ ఇవ్వడంతో ఈ నెల 21న అతని బంధువులు హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. చికిత్స కోసం నేపాల్ చెందిన అతని బంధువులందరూ డబ్బులు చందాలు వసూలు చేసిరూ. ఏడు లక్షల 50 వేల రూపాయలు చెల్లించారు.
హాస్పిటల్ వైద్య సిబ్బంది సరైన వైద్యం అందించకపోవడంతో సోమవారం ఉదయం కమల్ బహదూర్ మృతి( 40 )చెందాడు. కమల్ బహదూర్ బతుకుతాడని నేపాల్ చెందిన ప్రతి ఒక్కరు చందాలు వసూలు చేసి వైద్యం అందించినప్పటికీ నాణ్యత గల వైద్యం అందించకపోవడంతో కమల్ బహుదూర్ మృతిచెందాడని అతని బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళన దిగారు.
హాస్పిటల్ ముందు పోలీసుల బందోబస్తు..
హాస్పిటల్ ముందు బంధువులు ఆందోళన దిగడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఎల్బీనగర్ నాగోల్ చైతన్యపురి సీఐల ఆధ్వర్యంలో హాస్పిటల్ ముందు బందోబస్తు నిర్వహించి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు