మల్లూరు ఇసుక రీచ్ లో వివాదాలు.!
“భారీగా నిలిచిపోయిన ఇసుక లోడు లారీలు లబోదిబోమంటున్న డ్రైవర్లు”
“సంబంధిత శాఖ అధికారుల అతి ఉత్సాహం వలనే మల్లూరు ఇసక క్వారీలో వాగ్వాదాలు ఏర్పడ్డాయని పలు ఆరోపణలు.?”
“రైజింగ్ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే’ ఈ తగాదాలు అన్నట్టుగా పలు రకాల ఊహగానాలు.?”
“ములుగు జిల్లా సి కె న్యూస్ ప్రతినిధి భార్గవ్”
ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని మల్లూరు గ్రామంలో ఉన్నటువంటి ఇసుక క్వారీలో కాంట్రాక్టర్లకు మరియు గ్రామస్తులకు మధ్య గొడవ. కారణంగా భారీగా నిలిచిపోయిన ఇసుక లోడు లారీలు.
ప్రభుత్వం ముందుగా ఇసుక సొసైటీ ఫైలను ఒక కాంట్రాక్టర్ కి మంజూరు చేసి పలు రకాల కారణంగా ఆ ఫైలును మరల వేరే కాంట్రాక్టర్ కు అందించినందుకే, అల్లర్లు మొదలయ్యాయి అన్నట్టుగా గ్రామస్తుల ఆరోపణ.
ఇసుక సొసైటీలో జరిగే అల్లర్లు కాస్త గ్రామస్తుల వ్యక్తిగత కక్షలుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున. మల్లూరు ఇసుక క్వారీ విషయంలో అధికారులు శ్రద్ధ వహించి అంతు చిక్కని ప్రశ్నకు సమాధానం వెతికే మార్గం ఏర్పరచాలని ప్రభుత్వాన్ని మల్లూరు గ్రామస్తులు కోరారు.