Andhra Pradesh

భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మిస్ వైజాగ్..ఉతికారేసింది..!

భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మిస్ వైజాగ్..ఉతికారేసింది..!

పరాయి మహిళతో అడ్డంగా దొరికిన భర్త..

సినీ పరిశ్రమలో ఉన్న ఓ యువ జంట మధ్య విభేదాలు విశాఖపట్నంలో బయటపడ్డాయి. భర్త పరాయి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నాడని భార్య ఆరోపిస్తూ ఆయన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.తనకు విడాకులు ఇవ్వకుండానే తన భర్త మరో మహిళను వివాహం చేసుకున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గతంలో మిస్ వైజాగ్ టైటిల్ గెల్చుకున్న నక్షత్ర అనే మహిళ విశాఖపట్నంలో ఆందోళనకు దిగారు. ఈ ఘటన విశాఖలో కలకలం రేపింది.

నక్షత్ర 2017లో వెంటకసాయి తేజ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తడంతో తేజ మరో మహిళతో వేరు కాపురం పెట్టారని నక్షత్ర ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై తమ మధ్య ఎప్పటి నుంచో గొడవలు జరుగుతూ ఉండేవని నక్షత్ర తెలిపారు.

గురువారం నక్షత్ర తన భర్త మరో మహిళతో కలిసి ఉండగా మీడియా విలేకరుల సాయంతో అతణ్ని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ క్రమంలో భర్త తేజ, నక్షత్ర మధ్య చిన్నపాటి ఘర్షణ కూడా చోటు చేసుకుంది.

షూటింగ్ ఆఫీసు దగ్గరికి వచ్చి నక్షత్ర గొడవ చేయడంతో పోలీసులు ఆమెకు నచ్చ చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయితే, నక్షత్ర తనపై తప్పుడు కేసులు పెట్టిందని తేజ ఆరోపిస్తున్నారు. తన ఆఫీసుకు వచ్చిన యువతీ యువకులు సినిమా అవకాశాలు, ఆడిషన్ల కోసం వస్తుంటారని తేజ తెలిపారు.

11 ఏళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్లో నక్షత్ర – వెంటకసాయి తేజకు పరిచయం ఏర్పడి.. అది క్రమంగా స్నేహంగా తర్వాత ప్రేమగా మారింది. అనంతరం అది పెళ్లికి దారి తీసింది. మనసులు ఒక్కటి కావడంతో నక్షత్ర – సాయితేజ 2017 లో మ్యారేజ్ చేసుకున్నారు.

వీరికి ఓ కూతురు కూడా పుట్టింది. క్రమంగా ఇద్దరి మధ్యా విభేదాలు రావడంతో.. భార్య నక్షత్రకు విడాకులు ఇవ్వకుండానే భర్త సాయి తేజ మరో మహిళను పెళ్లి చేసుకున్నట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారు. తన భర్త తేజ ఆమె దగ్గరే ఉంటున్నాడని.. అందుకే తాను రెడ్ హ్యాండెడ్ గా అందరికి పట్టించినట్లు తెలిపారు.

తన భర్త తేజా పబ్జీ గేమ్ ఆడుతూ కూడా అమ్మాయిలను ట్రాప్ చేసేవాడని నక్షత్ర ఆరోపించింది. తనతో సాయితేజ మాట్లాడిన ఆడియో, వీడియోలు ఉన్నాయని.. తనకు రోజుకో మహిళ కావాలంటూ తనపై ఒత్తిడి చేస్తున్నాడని వెల్లడించింది. దీంతో భర్త ఇంటి వద్ద నిరసనకు దిగింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button