లైంగిక వేధింపులకు పాల్పడ్డ డాక్టర్ సస్పెండ్…
సూర్యాపేట : లైంగిక వేధింపుల విషయమై లోకల్ కంప్లయింట్ కమిటీ (ఎల్ సి సి) రెండు దఫాలుగా నోటీసులు జారీ చేసినప్పటికీ కాపుగల్లు మెడికల్ ఆఫీసర్, అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్.కళ్యాణ్ చక్రవర్తి హాజరు కాలేదు.
అందుకు కమిటీ నివేదిక ఆధారంగా జరిగిన సంఘటనపై కళ్యాణ్ చక్రవర్తిని సస్పెండ్ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ సోమవారం తెలిపారు.కాగా ఆయనపై గతంలో పలు లైంగిక ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఓ మహిళ డాక్టర్ పట్టణ పోలీసు స్టేషన్ లో ఈనెల 28న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
అంతకు ముందు ఆమె చక్రవర్తి వేధింపుల గురించి జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం తో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించిన కలెక్టర్ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.