మీర్ పేట్ లో దారుణ హత్య…
కూతురిని చూడడానికి వచ్చిన ఓ తండ్రి కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణకావేశంలో కూతురు అత్తని తల పై సుత్తితో కొట్టి దారణంగా హత్య చేశాడు.ఈ ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తీవ్ర కలకలం రేపింది
.ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ తెలిపిన వివరాల ప్రకారం..
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, కెసి తండాకు చెందిన జాటావత్ ప్రభు (45) స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక హిల్స్ లో నివాసముండే కొర్ర జయరామ్‌తో రెండేళ్ల క్రితం తన కూతురుని ఇచ్చి వివాహం జరిపించాడు. పెళ్లి జరిగినప్పటి నుంచి వరుస గొడవలు జరుగుతున్నాయి.
మంగళవారం మధ్యాహ్నం సమయంలో వినాయక హిల్స్ లో నివసించే తన కూతుర్ని చూడడానికి భార్యతో కలిసి వచ్చాడు. ఆ సమయంలో కూతురు అత్త కొర్ర లలిత (50) తో మాట మాట పెరిగి గొడవ పెద్దది కావడంతో కూతురు అత్తని ఆవేశంలో నెట్టేశాడు.
ఆమె కింద పడిపోగానే ఇంట్లో ఉండే ఇనుప సుత్తిని తీసుకొని ఆమె తల పై విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
విషయం తెలుసుకున్న పోలీసులు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని నిందితుని అదుపులోకి తీసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ కేసును మీర్ పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.