పార్లమెంట్ దగ్గర కలకలం
లోపలకు వెళ్ళడానికి ప్రయత్నించిన దుండగులు
పార్లమెంట్ భవనంలోకి ముగ్గురు దుండగులు అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించడంతో కలకలం రేగింది. గేట్ నంబర్ 3 నుంచి ఖాసీం, మోసిన్, షోయబ్ నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
గత డిసెంబర్లో సైతం దుండగులు పార్లమెంట్లోకి ప్రవేశించి పొగగొట్టాలతో సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడం సంచలనం రేపింది.