24 నుంచి పార్లమెంట్ సమావేశాలు
న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి 240 స్థానాలు వచ్చాయి. అయితే ఎన్డీఎ కూటమిలోని మిత్రపక్ష పార్టీలతో కలిసి మోడీ వరుసగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టారు.
ఆయన ఆదివారం ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులతో కలిసి 72 మందితో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. మంగళవారం ఆయా శాఖల మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. ఇక లోక్‌సభ కార్యకలాపాలను నిర్వహించేందుకు స్పీకర్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జూన్ 24 నుంచి జులై 3 వరకు పార్లమెట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కాగా, జూన్ 24, 25 తేదీల్లో జరిగే సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక జూన్ 26వ తేదీ లోక్‌సభ స్పీకర్ ఎంపిక జరగనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం లోక్‌సభ స్పీకర్ పదవి కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి బిజెపి, టిడిపి, జెడియు పార్టీలు పోటీపడుతున్నాయి