కలెక్టరేట్ ఎదుట వంట కార్మికుల ధర్నా.
మంత్రి పొంగులేటి కి వినతి పత్రం అందించిన ఏఐటీయూసీ నాయకులు ,
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
జూన్ 11,
భద్రాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ అధ్యర్యంలో వంట కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవిన్యు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి వినతిపత్రం అందచేశారు ఈ సందర్భంగా మంత్రి రానున్న రోజుల్లో సమస్యలు పరిస్కారం చేస్తాం అని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నరాటి ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్టం లో పాఠశాల లో పనిచేస్తున్న వంట కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రావటం తో కనీసం 10 వేలు వేతనం ఇస్తాం అన్న హామీ అమలు చెయ్యాలి అని కోరినారు, ప్రభుత్వం వంట కార్మికుల కు నిత్యావసర సరుకులు , కోడి గుడ్లు , సరఫరా చెయ్యాలి అని డిమాండ్ చేశారు.
అల్పాహారం , స్నాక్స్ , వండిన పనికి పారితోషకం అందించాలి అని , ఇన్సూరెన్స్ , హెల్త్ కార్డు , యూనిఫామ్ , అమలు చెయ్యాలి అని వంట కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి సతన్నపల్లి విజయ లక్ష్మి కోరినారు , ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు మంగ ,ప్రభావతి , ముత్యాలు, రమణ , కే అరుణ, పద్మ , క్రాంతి , సరళ , తదితరులు పాల్గొన్నారు.