— కబ్జా జరిగిన భూములు బయటకు తీస్తాం..
— ప్రభుత్వ భూములు కబ్జా జరిగితే ఎవ్వరిని ఉపేక్షించేది లేదు.
— ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్.
సి కే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునిర్.
సత్తుపల్లి పట్టణం లోని వైశ్యకాంతల చెరువు, తామర చెరువు , గాడుదుల వాగుల చెరువు ను మంగళ వారం అధికారులు తో కలిసి సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మేల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పరిశీలించినరు.
వేశ్యకాంతల చెరువు మెరక తూమును రిపేరు చేయవలసిందిగా రైతులు కోరగా వెంటనే ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు
ఎమ్మేల్యే,అనంతరం చెరువు మొత్తం పరిశీలిస్తూ చెరువుల్లో మిగిలిన పూడికను కూడా తీసే అవకాశాన్ని కూడా పరిశీలించాల్సిందిగా ఆదేశించారు.వేశ్యకాంతల చెరువు కట్టమీద మరియు ఎన్టీఆర్ కెనాల్ కట్టమీద వర్షాకాలం ప్రారంభం కాగానే మొక్కలు నాటి సింగరేణి వారిచే సంరక్షణ బాధ్యత తీసుకునే విధంగా ఏర్పాటు చేయబడిందని తెలియజేశారు.
అనంతరం ఎన్టీఆర్ కెనాల్ మీదుగా బేతుపల్లి చెరువు వరకు వెళ్లి కాలువను పరిశీలించారు,కాలవలో ఉన్న ముళ్ళకంపను శుభ్రం చేయవలసిందిగా ఇరిగేషన్ అధికారులు అదేశం ఇచ్చి అనంతరం గాడిదల వాగును పరిశీలించి వాగు ఆక్రమణ లో ఉండటం వలన వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది అని ప్రజలు తెలియజేయగా ఆక్రమణలో ఉన్న వారిని తొలగించి వేశ్యకాంతల చెరువు వరకు గాడుదుల వాగు నుండి ఇబ్బంది లేకుండా నీరు వెళ్లే ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులకు తేలిపినారు .
దానితో పాటు గా పోడు భూములను పరిశీలించి తామర చెరువు ఆయకట్టు రైతులు చెరువు తూములు పాడవడం వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతుందని చెరువు కాంట్రాక్టు నాసిరకమైన పనులు చేయడం వలన ఈ ఇబ్బంది వచ్చిందని ఎమ్మెల్యే అన్నారు.
చెరువు భూములు ను సర్వే చేపించి భూ ఆక్రమణ జరగకుండా సర్వే రాళ్లు వేపించి ప్రభుత్వ భూములను కాపాడాలని అధికారులు ను ఆదేశించారు. ఏ పార్టీ వారైనా, ఎంతటి వారైనా సరే ప్రభుత్వ భూములు కబ్జా చేసి ఉంటే వారిని ఉపేక్షేంచేది లేదు అని తెలియజేసినరు.ఈ కార్యక్రమం లో సంబంధిత ప్రభుత్వ అధికారులు నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.