హుజుర్ నగర్: ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి కార్మికుడు మృతి చెందిన సంఘటన హుజూర్ నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. హుజూర్ నగర్ ఎస్సై ఎం. ముత్తయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి .
హుజూర్ నగర్ పట్టణంలోని ఎన్ఎస్పీ కెనాల్ లో 11:30 గంటల సమయంలో చత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లా కూకనార్ గ్రామం చెందిన రాంసింగ్ బాఘెల అనే వ్యక్తి కొలతల కోసం ముత్యాల బ్రాంచ్ కాలువలో కిందికి దిగి
అక్కడ అల్యూమినియం మెజర్మెంట్స్ స్టాఫ్ తో కొలతలు పూర్తి చేసుకుని బయటికి వచ్చే క్రమంలో తన వద్ద ఉన్న అల్యూమినియం మెజర్మెంట్స్ స్టాఫ్ అనే కొలతల పరికరం సహాయంతో కాలువ పైకి ఎక్కుతున్నప్పుడు ఆ స్థలంలో పైన ఉన్న 11 కెవి కరెంట్ లైన్ ఉన్నది.
గమనించకుండా ఎక్కడం వలన ప్రమాదవశాత్తు కరెంటు తీగలకు తన వద్ద ఉన్న అల్యూమినియం మెజర్మెంట్స్ స్టాఫ్ అనేది తగలడం వలన కరెంటు షాక్ కు గురై అక్కడికక్కడే పడిపోయినది.
వెంటనే అక్కడ ఉన్న వారు గమనించి 108 కి కాల్ చేసి హుజూర్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించగా మార్గమధ్యలో మరణించాడు.
కాంట్రాక్టర్ బత్తుల నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ముత్తయ్య తెలిపారు.