HyderabadPoliticalTelangana

గొర్రెల స్కామ్ లో బిగ్ ట్విస్ట్....

గొర్రెల స్కామ్.. 2వ రోజు కస్టడీ విచారణ..

హైదరాబాద్: తెలంగాణలో గొర్రెల స్కామ్ దర్యాప్తులో ఏసీబీ అధికారులు స్పీడ్ పెంచారు. నిందితులను ఏసీబీ అధికారులు కస్టడీ లోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండవరోజు మంగళవారం మాజీ పశు సంవర్ధక శాఖ ఎండీ రాంచందర్ నాయక్, ఓఎస్డీ కళ్యాణ్‌ లను విచారించనున్నారు.

మాజీ సీఎం కేసీఆర్కు ఈడి బిగ్ షాక్
మాజీ సీఎం కేసీఆర్కు ఈడి షాక్ ఇచ్చింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన
గొర్రెల పంపిణీ పథకంపై PMLA కింద కేసు
నమోదు చేసింది.

గొర్రెల పంపిణీలో
అవకతవకలపై పూర్తి వివరాలను
ఇవ్వాలంటూ పశుసంవర్ధక శాఖకు ఈడీ
లేఖ రాసింది. ఈ క్రమంలో పశుసంవర్ధక శాఖ
ఎండీకి నోటీసులు పంపింది.

మొదటిరోజు సోమవారం కస్టడీ విచారణలో రామచందర్.. నోరు మెదపలేదు. అలాగే ఓఎస్డీ కళ్యాణ్ కూడా విచారణకు సహకరించలేదు. గొర్రెల స్కీము యూనిట్ కాస్ట్ పెంపు, దళారుల ప్రమేయంపై ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఎవరి ప్రమేయంతో దళారి, భోగస్ కంపెనీతో గొర్రెలను రైతులకు కొనుగోలు చేసి ఇవ్వాలని ఆదేశించారన్న కోణంలో విచారణ కొనసాగుతోంది.

రామచందర్, కళ్యాణ్‌లను ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారిస్తున్నారు. ఈరోజు కస్టడీ విచారణలో రాజకీయ నాయకుల పాత్ర, ఓఎస్డీ కళ్యాణ్‌ ఫైల్స్ తరలింపు, కాల్చివేత వీటన్నింటిపై ఏసీబీ అరా తీస్తోంది.

కాగా జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న పశు సంవర్ధక శాఖ మాజీ ఎండీ రామ్ చందర్ నాయక్.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్‌లను మూడు రోజులపాటు ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతించింది.

దీంతో సోమవారం వారిని కస్టడీలోకి తీసుకుని అధికారులు విచారించారు.కాగా గొర్రెల స్కామ్‌లో ఇప్పటికే 10 మందిని నిందితులుగా గుర్తించి పలువురిని అరెస్ట్ చేశారు. గొర్రెల స్కామ్‌లో మొదట రూ. 2.10 కోట్లు దారి మళ్ళినట్టు గుర్తించారు.

పశు సంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామ్ చందర్ నాయక్ , ఓఎస్డీ కళ్యాణ్ అరెస్ట్‌తో రూ.700 కోట్ల స్కామ్ జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. దీనికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించింది. కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్టర్ మోహినూద్దిన్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button