లంచం డబ్బు వదిలి.. పరుగో పరుగు..!
3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీసీఎస్ సీఐ
ఓ కేసు పరిష్కారం విషయంలో వ్యక్తి నుంచి రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ సీసీఎస్ సీఐ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. హైదరాబాద్, బోయిన్ పల్లికి చెందిన శ్రీమణి రంగస్వామిపై సీసీఎస్ లో ఓ కేసు నమోదైంది.
ఆ కేసును డిటెక్టివ్ డిపార్ట్ మెంట్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ టీం 7కి చెందిన సీఐ చామాకురి సుధాకర్ దర్యాప్తు చేస్తున్నారు. కేసును శ్రీమణి రంగస్వామికి అనుకూలంగా క్లోస్ చేసేందుకు రూ.15 లక్షలు లంచం డిమాండ్ చేశారు.
తొలి విడతగా రంగస్వామి నుంచి 5 లక్షలు తీసుకున్నారు. రెండో విడతగా గురువారం రూ. 3 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బును సీసీఎస్ పార్కింగ్ ప్లేస్ లోని సీఐకి రంగస్వామి ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
సుధాకర్ వద్ద నుంచి రూ.3 లక్షలు స్వాధీనం చేసుకున్న అధికారులు , అతనిపై కేసు నమోదు చేశారు. సీఐని నాంపల్లి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచినట్లు హైదరాబాద్ ఏసీబీ టీం 2 డీసీపీ శ్రీధర్ పేర్కొన్నారు.