టీచర్ హత్య కేసులో వీడిన మిస్టరీ…
వివాహేతర సంబంధానికి తన భర్త అడ్డు వస్తున్నాడని పెళ్లాడిన భర్తను కిరాయి హంతకులతో కిరాతకంగా హత్య చేయించింది ఓ భార్య…
వివరాల్లోకి వెళితే… అదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మేడిగూడలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న జాదవ్ గజేందర్ (32) ను ఈనెల 12న నార్నూర్ మండలం అర్జుని వద్ద దారిలో కాపు కాచి బండరాళ్లతో కొట్టి హతమార్చారు.
టీచర్ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని నార్నూరులో మహిళలు, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేయగా ఉట్నూర్ డిఎస్పి నాగేందర్ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగించారు.
ఈ కేసులో ప్రధాన ముద్దాయి గజేందర్ భార్య విజయలక్ష్మిగా తేలింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రియుడు మహేష్ తో భర్త హత్యకు కుట్ర పన్ని బేల మండల కేంద్రంలోని ఓ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న సుశీల్, ఉరువేత కృష్ణతో సుపారి ఒప్పందం కుదుర్చు కున్నారు.
గజేందర్ టీచర్ ను హత మారిస్తే ఆరు లక్షలు ఇస్తానని ప్రియుడు మహేష్ డీల్ చేయడంతో పథకం ప్రకారం టీచర్ గజేందర్ ను హతమార్చారు.
ఈ రోజు మధ్యాహ్నం డీఎస్పీ నాగేందర్, సీఐ రహీం నిందితులను మీడియా ముందు హాజరుపరిచి కేసు వివరాలను వెల్లడించారు.
మృతుడు గజేందర్ భార్య విజయలక్ష్మి, ఆమె ప్రియుడు మహేష్, సుపారి తీసుకొని హతమార్చిన నిందితులు సుశీల్, పూర్వేత కృష్ణలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించి నట్టు డీఎస్పీ వివరించారు…