కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త..!
కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, గౌరవ వేతన ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బంది సర్వీసును మరో నాలుగు నెలలు ప్రభుత్వం పొడిగించింది.ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు మెమో జారీ చేశారు.
వీరి సర్వీసు ఈ ఏడాది మార్చి 31 తోనే ముగియగా జులై 31 వరకు అనుమతిస్తున్నామని పేర్కొన్నారు. సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించాలని సూచించారు.
ఇది ఇలా ఉండగా, రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమా పథకాలకు 2 నెలల్లో రూ. 30 వేల కోట్లు అవసరమని ప్రభుత్వ అంచనా. ఆగస్టులోగా ఆ మేర రుణాలు తీసుకుంటేనే స్కీమ్ ల అమలు సాధ్యమని సమాచారం.
బాండ్ల విక్రయం ద్వారా అప్పు తీసుకోవాలని నిర్ణయించింది. అయితే ఏప్రిల్, మేలో రూ. 8,246 కోట్లు సేకరించగా….మరో రూ. 2వేల కోట్లు 3 రోజుల్లో తీసుకొనుంది. ఈ ఏడాది కోటాలో మరో రూ. 30 వేల కోట్లు తీసుకునేందుకు RBI అంగీకరిస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.